ది ప్యారడైజ్ సంపూ 'బిర్యానీ'.. ఇదెక్కడి మాస్ రా బాబు!

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది 'దసరా' క్రియేట్ చేసిన మాస్ విధ్వంసం.;

Update: 2025-12-19 18:40 GMT

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది 'దసరా' క్రియేట్ చేసిన మాస్ విధ్వంసం. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అంతకు మించి అనేలా 'ది ప్యారడైజ్' సినిమాను రూపొందిస్తున్నారు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమా ఎంత ర్రా గా ఉండబోతోందో హింట్ ఇచ్చాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ మాత్రం అందరినీ షాక్ కు గురిచేసింది.




బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సాధారణంగా సంపూ అంటేనే స్పూఫ్ కామెడీలు, నవ్వులు గుర్తొస్తాయి. కానీ శ్రీకాంత్ ఓదెల విజన్ లో సంపూ పూర్తిగా మారిపోయారు. అసలు పోస్టర్ చూస్తే అది సంపూర్ణేష్ బాబు అంటే ఎవరూ నమ్మలేనంతగా మేకోవర్ అయ్యారు. గుర్తుపట్టలేనంత కొత్తగా, ఒక రేంజ్ మాస్ అవతార్ లో ఆయన్ని ప్రెజెంట్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సినిమాలో సంపూ పాత్ర పేరు 'బిర్యానీ'. రిలీజ్ చేసిన పోస్టర్ లో సంపూ లుక్ నెవ్వర్ బిఫోర్ అని చెప్పాలి. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చేతిలో గొడ్డలి లాంటి ఆయుధం పట్టుకుని, నోట్లో బీడీ కాలుస్తూ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం సంపూర్ణేష్ బాబు భారీగా బరువు తగ్గి, డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నారని అర్థమవుతోంది. కామెడీ స్టార్ ను ఇలా భయంకరంగా చూపించడం శ్రీకాంత్ ఓదెలకే చెల్లింది.

ఇక కథలో ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది. నాని పోషిస్తున్న 'జడల్' అనే పాత్రకు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడిగా, ప్రాణానికి ప్రాణం ఇచ్చే దోస్తుగా సంపూ కనిపించనున్నారు. కేవలం పక్కన ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ లా కాకుండా, కథనంలో కీలక మలుపులు తిప్పే పాత్ర ఇదని తెలుస్తోంది. లాయల్టీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ 'బిర్యానీ' పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ బాబు, రాఘవ్ జుయల్ లాంటి విలన్ల లుక్స్ రిలీజ్ అయ్యి ఆసక్తిని పెంచాయి. దానికి తోడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు బ్యాక్ బోన్ కానుంది. సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ ను ఇంత డిటెయిల్డ్ గా డిజైన్ చేస్తున్నారంటే అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక సంపూ లుక్ తో 'ది ప్యారడైజ్' పై బజ్ మరింత పెరిగింది. కామెడీ ట్రాక్ కాకుండా సీరియస్ రోల్ లో సంపూ ఎలా ఉంటారో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 2026 మార్చి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News