• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్...

పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే..!

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలే కాదు పాలిటిక్స్ లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు

By - Tupaki Desk
Update: 2023-11-18 09:55 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలే కాదు పాలిటిక్స్ లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు. జనసేన అధినేతగా ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న పవన్ రాబోయే ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాలకు ఒక లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటుగా హరి హర వీరమల్లు సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. ఓజీ మొదలైంది మొదలు స్పీడ్ గా లాగించేస్తున్నారు.

డిసెంబర్ కల్లా ఆ సినిమా రిలీజ్ ఉంటుందని అనుకున్నారు కానీ అది జరిగేలా లేదు. ఓ పక్క హరీష్ శంకర్ సినిమా కూడా కనీసం ఐదారు నెలలు లేట్ అయ్యేలా ఉంది. ఏపీలో ఎలక్షన్స్ అయ్యేంతవరకు పవన్ సినిమాలు చేయకూడదని అనుకుంటున్నారట. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దర్శక నిర్మాతలు కన్ ఫ్యూజన్ లో పడ్డారు.

హరీష్ శంకర్ కి అయితే నువ్వు మరో సినిమా చేసుకోమని చెప్పాడట. అందుకే హరీష్ శంకర్ రవితేజతో సినిమాకు రెడీ అవుతున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ 2024 సమ్మర్ కల్లా అయినా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. అయితే ఎలక్షన్స్ తర్వాత అంటే ఏపీలో నెక్స్ట్ ఇయర్ మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో అప్పటివరకు సుజిత్ కూడా వెయిట్ చేయక తప్పదు.

క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా విషయంలో కూడా పవన్ అదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ వల్ల ఆయనతో సినిమా చేయాలని అనుకున్న దర్శక నిర్మాతలు కూడా ఈ ఆరు నెలలు వెయిట్ చేయాలి తప్పదనిపిస్తుంది. హరీష్ శంకర్ రవితేజ సినిమా ఓకే అయితే పర్లేదు కానీ ఆల్రెడీ రెండేళ్ల నుంచి పవన్ సినిమా కోసం ఎదురుచూసిన హరీష్ శంకర్ కి మరో ఆరు నెలలు సినిమా షూటింగ్ ఆపేసే పరిస్థితి వచ్చింది. నిర్మాతలు కూడా ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి పవన్ మళ్లీ డేట్స్ ఇచ్చే వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. సో 2024 సమ్మర్ తర్వాతే పవన్ సినిమాల సందడి ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    
  • Pawankalyan 
  • Janasena 
  • OGmovie 
  • Sujeeth 
  • Hariharaveeramallu 
  • Filmindustry 
  • Politics 
  • Pawan 
  • Harishshankar 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS