• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏపీ డిప్యూటీ సాబ్.. మాస్...

ఏపీ డిప్యూటీ సాబ్.. మాస్ లుక్ చూశారా?

| దీంతో పవన్ లుక్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సాబ్ తాజాగా మాస్ లుక్ తో కనిపించారు.

By - Tupaki Desk
Update: 2024-11-29 10:53 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మంత్రిగా తన శాఖలకు చెందిన అన్ని విధులను పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో తన చేతిలో ఉన్న చిత్రాలను కూడా పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత మిగతా చిత్రాల సెట్స్ లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరిహర మల్లు షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ వీకెండ్ లో భారీ షెడ్యూల్ ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. అందులో పవన్ కూడా పాల్గొనున్నారట.

దీంతో పవన్ లుక్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సాబ్ తాజాగా మాస్ లుక్ తో కనిపించారు. విధి నిర్వహణలో భాగంగా కాకినాడ వెళ్లిన ఆయన.. మాస్ అవతార్ లో సందడి చేశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం విషయంలో కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ తో కలిసి బోటుతో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బోటులో నిల్చుని పవన్ సముద్రాన్ని అబ్జర్వ్ చేస్తున్న మూమెంట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో ఉన్న పవన్.. పొడవాటి జుట్టు, చిన్నపాటి గడ్డంతో అదిరిపోయేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డిప్యూటీ సాబ్ లుక్ వేరే లెవెల్ అని చెబుతున్నారు. మాస్ అవతార్ లో అన్నయ్య సూపర్ అని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

అయితే పవన్ చేతిలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. ఓజీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన చిత్రీకరణ పెండింగ్ ఎక్కువగా ఉంది. మరి ఆ రెండు చిత్రాల సెట్స్ లో పవన్ కళ్యాణ్.. ఎప్పుడు అడుగు పెడతారో వేచి చూడాలి.

కాకినాడ పర్యటనలో మాస్ లుక్ లో కనిపించిన పవన్ కళ్యాణ్#PawanKalyan #Janasena #AndhraPradesh #Kakinada #Tupaki pic.twitter.com/EkULEmrHHc

— Tupaki (@tupaki_official) November 29, 2024
Tags:    
  • Pawankalyan 
  • Nadendlamanohar 
  • Kakinada 
  • OG 
  • Hariharaveeramallu 
  • Ustaadbhagathsingh 
  • Apdeputycm 
  • Andhrapradesh 
  • Politicalnews 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS