పవర్ స్టార్ కమిట్మెంట్ లెక్క ఇది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా అవ్వడం తో ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ హైప్ ఏర్పడింది. అంతేకాదు ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గాజు గ్లాస్ టీజర్ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది.
మిగతా దర్శకులు ఏమో కానీ పవర్ స్టార్ ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందో ఒక అభిమానిగా తెలిసిన హరీష్ శంకర్ ఉస్తాద్ ని గబ్బర్ సింగ్ ని మించి ఉండేలా చేస్తున్నారట. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ కూడా అదిరిపోయిందని టాక్. ఈ సినిమాను అనుకున్న టైం లో పూర్తి చేయాలని ఫిక్స్ అవగా అందుకు పవన్ కళ్యాణ్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారట.
అసలు ఎలాంటి రెస్ట్ కూడా తీసుకోకుండా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని తెలుస్తుంది. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధమవుతుంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పనిచేస్తూనే సినిమాల పరంగా తన కమిట్మెంట్ లను పూర్తి చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేశారు. ఇక వాటి లైన్ లోనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా త్వరగా పూర్తి చేసేలా చూస్తున్నారట. సినిమా టీం అంతా పవన్ రాకకోసం వెయిట్ చేయగా వచ్చీ రాగానే ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఐతే పవన్ కళ్యాణ్ వర్క్ మీద చూపిస్తున్న శ్రద్ధకు డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు మైత్రి నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ ఆల్బం సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దేవి శ్రీనే తీసుకున్నాడు హరీష్ శంకర్. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ పై కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.