టన్నుల కొద్దీ బరువు.. సుజిత్ లో నేను కనబడుతున్నా..!

తను చాలాసార్లు లాక్ ఆఫ్ టీం వర్క్ వల్ల ఫెయిల్ అయ్యాను. ప్రతి సినిమాకు నా ఎఫర్ట్ ఒకే విధంగా ఉంటాయి. నా ఎఫర్ట్స్ ఎక్కడ తగ్గవు.;

Update: 2025-10-02 03:59 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. అందుకే ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. సుజిత్ లాంటి టీం తో పనిచేయడం సంతోషంగా ఉందని. సుజిత్ ని చూస్తుంటే తనని చూసినట్టు ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. అతను ఇంతవరకు కథ చెప్పలేదు. తనని అర్థం చేసుకున్నా.. అదొక ఇంట్రెస్టింగ్ జర్నీ అని అన్నారు.

ఇంకో హీరోని ధ్వేషిస్తే..

ఓజీ సినిమాలో తాను చేసింది ఏమి లేదు టీం అంతా చాలా బాగా కష్టపడ్డారని అన్నారు. తాను ఆర్ట్ ఫాం ని ఇష్టపడతా ఇంకో హీరోని ధ్వేషిస్తే మనసు బాగాలేదన్నట్టే అని అన్నారు పవన్ కళ్యాణ్. అందరు హీరోలకు చెప్పేది ఏంటంటే ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ అందరు కష్టపడతారు. నేను అందరి సినిమాలు చూస్తాను. స్టాప్ డూయింగ్ ఫ్యాన్ వార్స్. దాని వల్ల సినిమా చచ్చిపోతుందని అన్నారు పవన్ కళ్యాణ్. సినిమా కోసం ఎంత కష్టపడి పనిచేస్తామో తెలుసు.. ఇళ్లలో ఎన్నో తిట్లు తింటాం. పిల్లలను కూడా సరిగా చూసుకోమని అన్నారు పవన్ కళ్యాణ్. లెట్ అస్ అప్రిషియేట్ ఈచ్ అదర్ అని అన్నారు. ఫ్యాన్ వార్స్ ఎవరికీ మంచిది కాదని పెరుగుట విరుగుట కొరకే అని అన్నారు పవన్ కళ్యాణ్.

తనకు జానీ సినిమా ఫెయిల్ అయ్యిందన్న రిగ్రెట్ లేదు.. ఫెయిల్యూర్ ని ఎదుగుదలకు మెట్టుగా చూస్తా.. ఓజీ సినిమాలో జానీ రిఫరెన్స్ ముందు చెప్పలేదు. ఈరోజు జానీ సక్సెస్ అయ్యిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఇక సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నా ఏమైనా ఇబ్బందా అని అడిగారు. అలాంటిది ఏమి లేదని చెప్పానన్నారు పవన్. యాక్టర్స్ గా వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. అంతమాత్రాన సినిమాలో నటించలేనని చెప్పలేం. ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నా అంటే అది సినిమా ఇచ్చిందే. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు కానీ సెట్ లో రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పా అన్నారు పవన్ కళ్యాణ్.

లాక్ ఆఫ్ టీం వర్క్..

తను చాలాసార్లు లాక్ ఆఫ్ టీం వర్క్ వల్ల ఫెయిల్ అయ్యాను. ప్రతి సినిమాకు నా ఎఫర్ట్ ఒకే విధంగా ఉంటాయి. నా ఎఫర్ట్స్ ఎక్కడ తగ్గవు. ఈ సినిమాకు సుజిత్ తనకు ఎక్కువ బరువు ఇవ్వలేదు. చాలా సినిమాలకు తాను ఎక్కువ టన్నుల కొద్దీ పనిచేశా అన్నారు పవన్ కళ్యాణ్.

సుజిత్ ఈ సినిమాను ఎక్కడో చిన్న విజువల్ గా స్టార్ట్ చేసి ఇదంతా చేశాడు. ఇదంతా టీం వర్క్ తోనే సాధ్యం. నేను కొత్తగా చేస్తున్న టైం లో ఏదైనా చెబుదాం అంటే.. నువ్వే కొత్త నీ ఐడియాలు కొత్త.. నువ్వేం పనిచేస్తావ్ అనేవారు.. సుజిత్ లో నేను కనిపిస్తా. తనని బాగా అర్ధం చేసుకున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి ఇంటి పెద్దగా ఉన్న థమన్ ఈ సినిమా మ్యూజిక్ తో తన తండ్రికి ట్రిబ్యూట్ ఇచ్చాడని అన్నారు పవన్ కళ్యాణ్.

బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ స్పీచ్ ఫ్యాన్స్ ని సూపర్ హ్యాపీ చేసింది.

Tags:    

Similar News