• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ OG.. ఈసారైనా...

పవన్ OG.. ఈసారైనా ఫ్యాన్స్ కోరిక తీరుతుందా?

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ (They Call Him OG) ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By - M Prashanth
Update: 2025-09-28 21:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ (They Call Him OG) ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ పడగా, ఆ తర్వాత రోజు వరల్డ్ వైడ్ గా మూవీ విడుదలవ్వగా.. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు వెళ్తూ.. ఫుల్ గా సందడి చేస్తున్నారు. సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుడి కట్టినా తప్పులేదంటూ.. తాము పవన్ ను ఎలా చూడాలనుకున్నామో అంతకుమించి చూపించారని చెబుతున్నారు. థ్యాంక్యూ మాస్టర్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఓ విషయంలో మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పాలి. అది సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్ గురించే. ఎందుకంటే గత మూవీ హరిహర వీరమల్లు సమయంలో పవన్.. ఒకే రోజు అనేక మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో సినిమాల పరంగా చిన్న గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యారు.

కానీ ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఓజీ మూవీ విషయంలో కూడా పవన్ ప్రమోషన్స్ తో సందడి చేస్తారని, మళ్ళీ తమతో కనెక్ట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే వచ్చారు. ఓజీ కన్సర్ట్ పేరుతో జరిగిన ఆ కార్యక్రమం.. వర్షార్పణం అయింది.

పవన్ అనేక విషయాలు పంచుకుంటారని, ఫుల్ గా మాట్లాడతారని ఆశిస్తే.. వర్షం వల్ల ఫ్యాన్స్ ఆశ తీరలేదు. ఆ తర్వాత మేకర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. అందులో పవన్ పాల్గొనలేదు. ఎందుకంటే.. ఆ సమయంలో ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అలా జరగడంతో ఫ్యాన్స్ కోరిక అలానే ఉండిపోయింది.

అయితే ఇప్పుడు పవన్.. అభిమానుల ముందుకు త్వరలోనే రానున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఓజీ సక్సెస్ మీట్ ను మేకర్స్ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారని సమాచారం. అందుకు గాను ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాని టాక్ వినికిడి. అందులో పవన్ సహా ఓజీ క్యాస్టింగ్, టెక్నీషియన్స్ అంతా పాల్గొనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో అదే జరిగితే ఫ్యాన్స్ కోరిక నెరవేరనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Pawankalyan 
  • OG 
  • Sujeeth 
  • Thaman 
  • OGSuccessMeet 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS