OG: DVV హై వోల్టేజ్ వార్నింగ్
దీంతో ఓజీ మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. అలాంటి న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్న వారికి హై వోల్టేజ్ వార్నింగ్ ఇచ్చారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ (OG) మూవీ.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనుండగా.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమాను.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. తెలుగులో తప్ప మిగతా ఏ లాంగ్వేజ్ లో మూవీ రిలీజ్ అవ్వదని, ఇప్పటికే మేకర్స్ డిసైడ్ అయ్యారని కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. దీంతో ఓజీ మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. అలాంటి న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్న వారికి హై వోల్టేజ్ వార్నింగ్ ఇచ్చారు.
చర్యలు తీసుకుంటామని పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.రూమర్స్ ఉన్న పోస్ట్ ను షేర్ చేసి.. ఇలాంటి తప్పుడు న్యూస్ లు రాసి ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తే మోహం ..లో ముంచి కొడతా అంటూ రాసుకొచ్చారు. తద్వారా సైలెంట్ గా భారీ కౌంటర్ ఇస్తూనే.. ఒక్క పోస్ట్ తో బిగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడ్ పెచ్చారు. ఇప్పటికే పలు సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. రీసెంట్ గా పవర్ ఫుల్ సాంగ్ గన్స్ అండ్ రోజెస్ ను సోమవారం విడుదల చేశారు. అది మరెదో కాదు సినిమా తొలి గ్లింప్స్ లో హైలైట్ అయిన హంగ్రీ చీతా పాటనే. ప్రస్తుతం అందరినీ తెగ అలరిస్తోంది.
అదే సమయంలో ఇప్పటికే చిత్రం నుంచి రిలీజైన గ్లింప్సెస్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందోనని అభిమానులు, సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఓజీ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.