పవన్ లైనప్ పై క్లారిటీ ఇదే!
ఇక మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇకపై వరుస పెట్టి సినిమాలు చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.;
రాజకీయాల్లోకి వెళ్లి ఎలక్షన్లలో గెలిచి ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయరేమో అని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన్ను నమ్ముకుని మూడు సినిమాలు మొదలవడంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాటిని పూర్తి చేయాల్సిందేనని కంకణం కట్టుకున్న పవన్ ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ కూడా చేశారు.
ఫ్యాన్స్ ఆకలిని తీర్చిన ఓజి
ఆ రెండు సినిమాలే హరి హర వీరమల్లు, ఓజి. వాటిలో వీరమల్లు సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకోగా, ఓజి సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటూ ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశగా ఉన్న ఫ్యాన్స్ ఆకలిని కూడా తీర్చింది. ఈ ఇయర్ లోనే పవన్ నుంచి వీరమల్లు, ఓజి సినిమాలు రావడంతో పాటూ ఓజి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
పవన్ తర్వాతి సినిమాల కోసం పలువురు డైరెక్టర్లు
ఇక మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇకపై వరుస పెట్టి సినిమాలు చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే పలువురి డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఏ కొత్త సినిమాకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఏ కొత్త సినిమాకీ సైన్ చేయలేదట. ఇప్పుడు ఆయన దృష్టంతా తన రాజకీయ పనులపైనే పెట్టారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాబట్టి పవన్ కు సంబంధించి ఏ సినిమా గురించైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు దాన్ని నమ్మడానికి వీల్లేదన్నమాట. మొన్నటివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి ఎంతో కష్టపడిన పవన్, ఇకపై ఎంతో ఆలోచించి సినిమాలను చేయాలనుకుంటున్నారట.