పవన్ కళ్యాణ్ తో ఫోటో.. స్టేజీపై నటి గంతులే గంతులు!
ఆ తర్వాత పవన్ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న నటి నివితను పవన్ గుర్తించారు. వీరమల్లు మూవీలో ఆమె యాక్ట్ చేశారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. జులై 24న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.
అయితే మేకర్స్ నిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా.. మూవీ టీమ్ అంతా సందడి చేసింది. పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు. తన కెరీర్‌లో సినిమా సక్సెస్ మీట్ కు హాజరవడం తొలిసారి అని తెలిపారు. గత రెండు రోజుల్లో తాను మాట్లాడిన విషయాలు, తన 29 ఏళ్ల సినీ జీవితంలో 10 శాతం కూడా మాట్లాడలేదని పవన్ చెప్పారు.
ఆ తర్వాత పవన్ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న నటి నివితను పవన్ గుర్తించారు. వీరమల్లు మూవీలో ఆమె యాక్ట్ చేశారు. మీరే కదా నటించారని అడగ్గా.. అవును అని ఆమె అన్నారు. అయితే మీరు చాలా బాగా నటించారని కొనియాడారు. అప్పుడు ఆమె ఫోటో కావాలని అడగ్గా.. వెంటనే స్టేజ్ పైకి రమ్మని ఇన్వైట్ చేశారు పవన్.
ఆ సమయంలో వేదికపైకి వచ్చిన నివిత.. పవన్ కాళ్ళను మొక్కేందుకు ట్రై చేశారు. దీంతో వద్దని ఆయన వారించారు. ఆ తర్వాత ఆమెతో కాసేపు మాట్లాడి.. ఫోటో దిగారు. దీంతో నివిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా స్టేజిపై ఎగిరి గంతేశారు. పవన్ తో ఫోటో దిగినందుకు చాలా ఆనందంగా ఫీలయ్యారు.
అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నివిత రియాక్షన్ ట్రెండింగ్ లో నిలిచింది. అదే సమయంలో ఇంతకుముందు ఆమె మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చాలా స్వీట్ పర్సన్, అందరినీ కేర్ తీసుకుంటారని చెప్పారు.
సెట్స్ ను కాసేపట్లోనే కంఫర్టబుల్ జోన్ గా మార్చేస్తారని నివిత తెలిపారు. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటూ కొనియాడారు. షూటింగ్ టైమ్ లో చాలా స్ట్రెస్ కనిపించారని.. రాజకీయాల వల్ల ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పారు. కానీ స్పాట్ కు వచ్చాక బెస్ట్ ఇస్తారని ప్రశంసించారు. ఆయన బెస్ట్ టెక్నీషియన్ అని, పవన్ గారు ఇచ్చే టిప్స్ కోసం అంతా వెయిట్ చేస్తారని చెప్పారు. అలా తనకు ఎంతో ఇష్టమైన పవన్ తో నివిత దిగిన పిక్.. ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.