పవర్ స్టార్ వింటేజ్ స్పీచ్.. గూస్ బంప్స్..!
ఇక అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. తాను పడుతూ లేస్తూ ఉన్నా కూడా తన వెంటే అభిమానులు ఉన్నారని అన్నారు. పడినప్పుడు ఓదారుస్తూ.. లేచినప్పుడు అభినందించారని అన్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందే మార్నింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఈవెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆడిటోరియం అంతా ఫ్యాన్స్ కోలాహలంతో అదిరిపోయింది.
ఐతే ఎప్పుడు లేని విధంగా పవన్ తన కెరీర్ పై డిఫరెంట్ గా స్పందించారు. తను సక్సెస్ లో ఉన్నప్పుడు ఉన్నవాళ్లు ఫ్లాపుల్లో ఉంటే లేరని అన్నారు. పదేళ్ల పాటు ఫ్లాపుల్లో ఉన్నానని.. గబ్బర్ సింగ్ టైం లో ఒక్క హిట్టు ఇవ్వమని అభిమానులు అడిగానని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.
జానీ సినిమా నుంచి సినిమాల మీద గ్రిప్ కోల్పోయా. ఐతే ఫ్లాపుల్లో ఉన్న తన దగ్గరకు ఎవరు రాలేదు కానీ త్రివిక్రం శ్రీనివాస్ వచ్చి జల్సా సినిమా తీశాడని అన్నారు. అతను నా నిజమైన స్నేహితుడని అన్నారు. సక్సెస్ ఉంటే వెతుక్కుంటూ వస్తారు కానీ త్రివిక్రం నేను ఫ్లాపుల్లో ఉన్నా వచ్చాడని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక తను రీమేక్ చేయడానికి గల కారణాన్ని చెబుతూ పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరని.. అందుకే రీమేక్ సినిమాలు చేసే వాడినని అన్నారు. కొత్త సినిమాలు ఫ్లాపైతే తనని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏమవుతుందో అని రీమేక్ సినిమాలైతే కచ్చితంగా డబ్బులు వస్తాయని చేశానని అన్నారు పవన్ కళ్యాణ్.
ఇక అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. తాను పడుతూ లేస్తూ ఉన్నా కూడా తన వెంటే అభిమానులు ఉన్నారని అన్నారు. పడినప్పుడు ఓదారుస్తూ.. లేచినప్పుడు అభినందించారని అన్నారు. తనతో రీమేక్ సినిమా తీస్తే పని అవుతందని అనుకున్నారు. మీరేమో రీమేక్ లు తీస్తే తిడతారు.. మరి నా భార్య పిల్లల్ని, పార్టీని పోషించాలి.. వాటికి డబ్బులు కావాలి.. అందుకే వీటికి రీమేక్ అనేది ఈజీ దారి అని అన్నారు పవన్ కళ్యాణ్.
నాకు దేశమంటే పిచ్చి, సమాజం పిచ్చి.. సినిమా మీద ఉన్న పిచ్చి.. మీకు నేనంటే పిచ్చి.. ఏ.ఎం రత్నం ద్వారా ఒక మంచి సినిమా వచ్చింది. క్రిష్ గారి వల ఈ ప్రాజెక్ట్ మొదలైంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ సినిమాను చాలా బాగా తీశాడని అన్నారు పవన్ కళ్యాణ్. సినిమా కథ గురించి చెబుతూ హిందువుగా జీవించాలంటే శిస్తు కట్టాలన్న మొఘలుల పాలనలో వీరమల్లు ఏం చేశాడన్నది కథ అని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాకు కీరవాణి అసలైన హీరో అని అన్నారు. నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకున్న ఆయన వల్లే వీరమల్లు సినిమాకు ఇంత బజ్ వచ్చిందని అన్నారు పవన్ కళ్యాణ్. హీరోయిన్ నిధి అగర్వాల్ ఒంటరిగా ఈ సినిమా ప్రమోట్ చేశారు. ఆమెను చూసి నేను సిగ్గుపడాల్సి వచ్చిందని అన్నారు.
ఈవెంట్ చాలా భారీగా ప్లాన్ చేసినా సరే.. వర్షం ఇంకా బోనాల జాతర వల్ల సైజ్ తగ్గించాల్సి వచ్చింది. ఈ వేడుకకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ, సైబరాబాద్ కమిషనర్ కి తన కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.