అందాల నిధితో వీరమల్లు 'తార తార'
ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా నుంచి తార తార అంటూ సాగే పాటను విడుదల చేశారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, రఘుబాబు వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి.. స్వరాలు సమకూర్చారు.
అయితే ఇప్పటికే మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా కాస్త లేట్ అయినా.. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. భారీ హోప్స్ కూడా పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా నుంచి తార తార అంటూ సాగే పాటను విడుదల చేశారు.
రీసెంట్ గా పోస్టర్ తో సాంగ్ పై మేకర్స్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్ళు.. అంటూ సాగుతున్న పాటలో నిధి అగర్వాల్ తన అందాలతో ఆకట్టుకున్నారు. గ్లామర్ పోజులతో మెప్పించారు. సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
పవన్ కూడా తన ప్రెజెన్స్ తో అలరించారు. అయితే పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా.. లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ కలిసి ఆలపించారు. అయితే స్క్రీన్ పై సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంటుందని క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో సాంగ్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని అటు ఫ్యాన్స్.. ఇటు సినీ ప్రియులు చెబుతున్నారు.
కాగా, జూన్ 12వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలో కూడా ఈవెంట్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. మరి మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.