వీరమల్లు 'అసుర హననం'.. బజ్ రగిలింది!

సినిమా నుంచి మూడవ సింగిల్ 'అసుర హననం' ఈరోజు విడుదలైంది. ఈ పాట లిరిక్స్, ఎంఎం కీరవాణి కంపోజింగ్ కు పర్ఫెప్ట్ సింక్ అయ్యింది.;

Update: 2025-05-21 08:04 GMT

'హరిహర వీరమల్లు' సినిమా మెల్లమెల్లగా మళ్ళీ భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. వరుసగా వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ టార్గెట్ ను సెట్ చేసుకొని ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి స్టార్ కాస్ట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా జూన్ 12 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా యొక్క ప్రమోషన్స్ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.


సినిమా నుంచి మూడవ సింగిల్ 'అసుర హననం' ఈరోజు విడుదలైంది. ఈ పాట లిరిక్స్, ఎంఎం కీరవాణి కంపోజింగ్ కు పర్ఫెప్ట్ సింక్ అయ్యింది. పాటలో పవన్ కళ్యాణ్ యొక్క పవర్‌ఫుల్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఫిదా చేశాయి. 'అసుర హననం' పాట లిరిక్స్ గోసాల రాంబాబు అందించారు. అలాగే కాలభైరవ, సాయి, చరణ్ భాస్కరుని, లోకేశ్వర్, హైమత్ కలిసి ఆలపించారు.

హరిహర వీరమల్లు సినిమా యొక్క కాన్సెప్ట్, స్టోరీ డీటైల్స్ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా వీరమల్లు అనే వారియర్ యొక్క జీవిత కథను చూపిస్తుంది. ఈ సినిమా లోపల ధర్మ యుద్ధం కోసం పోరాడుతూ, ఒక లెగసీని సృష్టిస్తూ వీరమల్లు యొక్క ప్రయాణాన్ని చూపిస్తుంది. 16వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా సినిమాలో బ్యాక్ డ్రాప్ స్టోరీగా ప్రజెంట్ చేయనున్నారు.

మొదట క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, చివరికి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఫినిష్ అయ్యింది. ఈ మార్పు సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌లోనే హై వోల్టేజ్ సన్నివేశాలు సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెంచేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇక కీరవాణి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మరో సాంగ్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా హరిహర వీరమల్లు రిలీజ్ సమయానికి మంచి హైప్ క్రియేట్ చేసుకునేలా వెళుతోంది.

Full View
Tags:    

Similar News