బిగ్ బాస్ 9 : విన్నర్ కన్నా తనూజకే టాప్ రెమ్యునరేషన్..!

ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ ని జస్ట్ ఒక ఛాన్స్ తో మిస్ చేసుకుంది తనూజ. ఆమే ఈ సీజన్ విన్నర్ అనే టాక్ కూడా వచ్చింది.;

Update: 2025-12-22 12:12 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్ కాగా తనూజ రన్నరప్ గా నిలిచింది. సీజన్ 9లో మొదటి నుంచి తనూజ ఆడియన్స్ కు ఫేవరేట్ కంటెస్టెంట్ కాగా ఇమ్మాన్యుయెల్ కూడా టైటిల్ రేసులో ఉన్నాడని అనిపించగా మధ్యలో కళ్యాణ్ వచ్చి ఏకంగా టైటిల్ కొట్టేశాడు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ గా మొదలైన సీజన్ 9లో ఒక కామనర్ టైటిల్ విజేతగా నిలిచి సక్సెస్ అయ్యాడు. ఐతే విన్నర్ గా కళ్యాణ్ 40 లక్షల ప్రైజ్ మనీ (రోఫ్త్ కంపెనీ ఇచ్చిన 5 లక్షలుతో కలిపి) ఇక వారానికి 70 వేల చొప్పున ఒక పదిన్నర లక్షలు అతను రెమ్యునరేషన్ గా అందుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ విన్నర్ అవుతుందని..

ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ ని జస్ట్ ఒక ఛాన్స్ తో మిస్ చేసుకుంది తనూజ. ఆమే ఈ సీజన్ విన్నర్ అనే టాక్ కూడా వచ్చింది. కానీ జస్ట్ మిస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ విన్నర్ అవుతుందని అనుకున్న ఆడియన్స్ కి నిరాశ తప్పలేదు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ కన్నా ఎక్కువ తన రెమ్యునరేషన్ రూపంలో అందుకుంటుంది తనూజ. సీరియల్ స్టార్ అయిన తనూజ వారానికి 3 లక్షల చొప్పున 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంది.

అలా 45 లక్షల దాకా ఆమెకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఐతే కళ్యాణ్ కి వచ్చిన ప్రైజ్ మనీలో ట్యాక్స్ లు బాగానే కట్ అయ్యేలా ఉన్నాయి. అలా చూస్తే తనూజకే ఎక్కువ పారితోషికం వచ్చినట్టు లెక్క. ఐతే టైటిల్ విన్నర్ అయినా రన్నరప్ అయినా బిగ్ బాస్ వాళ్లు ఇచ్చే దానికన్నా బయట వాళ్లు ఎక్కువ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో మరో సీజన్ స్టార్ట్ అయ్యే వరకు..

దాదాపు తెలుగు రెండు రాష్ట్రాల్లో మరో సీజన్ స్టార్ట్ అయ్యే వరకు టైటిల్ విన్నర్ కి టాప్ 5 కంటెస్టెంట్ కి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వచ్చే ఆరు నెలలు ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఐతే తనూజ సీరియల్స్ కి కాస్త గ్యాప్ ఇవ్వడంతో బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన ఆమెకు ఇక మీదట కచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

సీజన్ 9లో టైటిల్ విన్నర్ కళ్యాణ్, రన్నరప్ తనూజ ఇద్దరు కూడా హౌస్ లో మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగించారు. ఓ విధంగా తనూజ ఫ్రెండ్ షిప్ వల్లే కళ్యాణ్ టైటిల్ విన్నర్ దాకా వచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సీజన్ 9 లో ఒక కామన్ మ్యాన్ విన్నర్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

Tags:    

Similar News