హిట్టు కోసం అడల్ట్ కామెడీనే నమ్ముకున్నాడే!
అందులో `హ్యాపీ రాజ్` రిలీజ్‌కు రెడీ అవుతోంది. కెరీర్ ప్రారంభంలో హీరోగా వరుస విజయాల్ని సొంతం చేసుకున్న జీవి ప్రకాష్ కుమార్ ఈ మధ్య ఆ రేసులో వెనుక బడ్డాడు.;
మ్యూజిక్ కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్ఖ్ చేస్తూనే మరో పక్క నటుడిగానూ తన సత్తా చాటుకుంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ చేతిలో శివ కార్తికేయన్ `పరాశక్తి`, సూరి `మందాడి`తో పాటు సూర్య 46, ధనుష్ 54, దుల్కర్ 41 ప్రాజెక్ట్, అజయ్ భూపతి క్రేజీ మూవీ ఉన్నాయి.
వీటితో పాటు జీవీ ప్రకాష్ హీరోగా ఈ ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒకటి రెండు పూర్తవ్వగా మరి కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. మరి కొన్ని రిలీజ్‌కు రెడీ అవుతూ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌కి చేరుకున్నాయి. అందులో `హ్యాపీ రాజ్` రిలీజ్‌కు రెడీ అవుతోంది. కెరీర్ ప్రారంభంలో హీరోగా వరుస విజయాల్ని సొంతం చేసుకున్న జీవి ప్రకాష్ కుమార్ ఈ మధ్య ఆ రేసులో వెనుక బడ్డాడు.
ప్రస్తుతం చేస్తున్న `హ్యాపీ రాజ్` తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనుకుంటున్నాడు. ఈ మూవీ ద్వారా మరియ రాజా ఎలంచెజియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సాగే రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెలుస్తోంది. ప్రోమో చూసిన ఆడియన్స్ దీనిపై మిక్స్డ్ రిస్పాన్స్‌ని వ్యక్తం చేశారు. కొంత మంది యూత్‌కి కావాల్సిన ఫన్ ఉందంటే మరి కొంత మంది మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్స్ అభ్యంతరకంగా ఉన్నాయని కామెంట్‌లు చేస్తున్నారు.
కొంత మంది మాత్రం జీవీ ప్రకాష్ కుమార్ మళ్లీ తన పాత స్టైల్‌లోకి వచ్చేశాడని, గతంలో చేసిన డబుల్ మీనింగ్ మూవీ `త్రిష ఇలియానా నయనతార` మూవీని గుర్తు చేస్తోందని అంటున్నారు. `హ్యాపీరాజా` యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాజా ఎలంచెజియన్ ఇంతకు ముందు టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేశాడట. అదే ఇప్పుడు ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేస్తోంది.
ఇందులో మ్యాడ్, లవర్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించింది. ఇక కథని మలుపుతిప్పే క్యారెక్టర్‌లో ఒకప్పటి లవర్ బాయ్, ప్రేమదేశం హీరో అబ్బాస్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో తను హీరోయిన్ ఫాదర్‌గా కనిపించబోతున్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మూవీ తనకు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించడం పక్కా అని జీవీ చాలా కాన్షిడెన్స్‌గా ఉన్నాడు. చాలా రోజుల తరువాత హీరోగా హిట్టు కోసం జీవీ మరోసారి అడల్ట్ కామెడీ నమ్ముకున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.