పూజా హెగ్డే స్టన్నింగ్ గ్లామర్.. ఇలా ఎప్పుడైనా చూశారా..
ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో పూజా రకరకాల అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయింది. ముఖ్యంగా సిల్వర్ కలర్ డ్రెస్‌లో ఆమె లుక్ అదిరిపోయింది.;
టాలీవుడ్ 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై ఎంత అందంగా కనిపిస్తుందో, బయట ఫ్యాషన్ విషయంలో అంతకంటే ఎక్కువ కేర్ తీసుకుంటుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం తనదైన స్టైల్ స్టేట్మెంట్స్తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన వింటర్ కలెక్షన్ ఫొటోలు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి.
ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో పూజా రకరకాల అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయింది. ముఖ్యంగా సిల్వర్ కలర్ డ్రెస్‌లో ఆమె లుక్ అదిరిపోయింది. కారులో కూర్చుని, కళ్ళద్దాలు చేత్తో పట్టుకుని ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తుంటే చాలా స్టైలిష్‌గా, రిచ్‌గా అనిపిస్తోంది. అదే డ్రెస్‌పై వైట్ కలర్ ఫర్ కోట్ ధరించి రాయల్ లుక్‌లో దర్శనమిచ్చింది.
మరో లుక్‌లో బ్లాక్ లెదర్ స్కర్ట్, దానికి మ్యాచింగ్‌గా లెదర్ జాకెట్ ధరించి వింటర్ వైబ్స్‌ను పర్ఫెక్ట్గా క్యారీ చేసింది. మోకాళ్ళ వరకు ఉండే బ్లాక్ బూట్స్ వేసుకుని, గోడకు ఆనుకుని నిల్చున్న తీరు చూస్తే 'బాస్ లేడీ'లా అనిపిస్తోంది. ఈ లుక్ పార్టీలకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఆమె క్యాప్షన్ ద్వారా హింట్ ఇచ్చింది. ఇక మరో ఫొటోలో మెరూన్ కలర్ మినీ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.
మెట్లపై నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఉన్న ఈ పిక్‌లో, ఆమె టోన్డ్ లెగ్స్ హైలైట్ అవుతున్నాయి. డ్రెస్‌పై ఉన్న డిజైన్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. సింపుల్ బ్లాక్ హీల్స్‌తో తన స్టైలింగ్‌ను కంప్లీట్ చేసింది. "ఈ సీజన్లో నా ఫ్యాషన్ మూడ్స్ ఇవే" అంటూ లైఫ్‌స్టైల్ స్టోర్స్‌తో కొలాబరేట్ అయ్యి ఈ ఫొటోలను షేర్ చేసింది పూజా. కూల్ వింటర్ లుక్స్ నుంచి, పార్టీల్లో తల తిప్పుకునేలా చేసే జాకెట్స్ వరకు అన్నీ ఇందులో ఉన్నాయని చెప్పింది. ఏది ఏమైనా పూజా హెగ్డే గ్లామర్ షోతో ఈ వింటర్ హీట్ పెంచేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల అమ్మడు పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. కూలి సినిమాలో మెరిసినా అది అంతగా హెల్ప్ కాలేదు. నెక్స్ట్ మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. మరి వాటితో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.