యుఎస్ఏలో 'శంబాల' సౌండ్.. ఆది కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలా!

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. సైన్స్ వెర్సెస్ క్షుద్రశక్తులు అనే యునిక్ కాన్సెప్ట్ యూత్ కి, ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.;

Update: 2025-12-22 12:24 GMT

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ఈసారి ట్రాక్ మార్చి పూర్తిగా కొత్త రూట్ లోకి వచ్చేశాడు. రొటీన్ కి భిన్నంగా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడని శంబాల ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ చూసినప్పుడే ఆడియెన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు దీనిపైనే ఒక ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో ఆది తన మార్కెట్ రేంజ్ ని మార్చుకోబోతున్నాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. సైన్స్ వెర్సెస్ క్షుద్రశక్తులు అనే యునిక్ కాన్సెప్ట్ యూత్ కి, ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. గ్రాఫిక్స్, విజువల్స్, సౌండ్ డిజైనింగ్ చూస్తుంటే మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పీక్స్ కి చేరింది. అయితే అసలు సర్ ప్రైజ్ వేరే  ఉంది.

అసలు విషయం ఏంటంటే, ఓవర్సీస్ లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. లేటెస్ట్ గా యుఎస్ఏలో 'శంబాల' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ఆది సాయికుమార్ కెరీర్ లోనే ప్రీమియర్స్ కి ఇంత ఎర్లీగా, ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం, ఇంత పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఇదే తొలిసారి అని చెప్పాలి.

సోషల్ మీడియాలో కూడా దీనిపై గట్టిగానే చర్చ జరుగుతోంది. థియేటర్ల సీటింగ్ మ్యాప్స్, బుకింగ్ స్టేటస్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే మనోళ్లు ఎక్కడ ఉన్నా ఆదరిస్తారని దీన్ని బట్టి అర్థమవుతోంది. డల్లాస్ నుంచి న్యూయార్క్ వరకు తెలుగు వాళ్లు ఈ మిస్టికల్ థ్రిల్లర్ ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కేవలం స్టార్ పవర్ ఉంటేనే ఓవర్సీస్ లో కలెక్షన్స్ వస్తాయనే రోజులు ఎప్పుడో పోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తే చాలు, ఆడియెన్స్ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. హనుమాన్, విరూపాక్ష, కాంతార లాంటి సినిమాలు నేర్పిన పాఠం ఇదే. ఇప్పుడు 'శంబాల' కూడా అదే దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆది ఈసారి కంటెంట్ ని నమ్ముకుని చేసిన ప్రయోగం ఫలించేలా ఉంది.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వస్తున్న ఈ సినిమా, ఆదికి ఒక మెమరబుల్ హిట్ ఇచ్చేలా ఉంది. ప్రీమియర్స్ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే, లాంగ్ రన్ లో మంచి లాభాలు రావడం ఖాయం. ఇన్నాళ్లు ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆదికి, రిలీజ్ కి ముందే వచ్చిన ఈ ఓవర్సీస్ బజ్ ఫుల్ కిక్ ఇస్తోంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.



Tags:    

Similar News