హిందీ 'దృశ్యం 3' డేట్ ఫిక్స్.. మిగతా భాషల్లో సంగతేంటి?

దీంతో ఇప్పుడు అంతా మూడో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే దృశ్యం-3 అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి.;

Update: 2025-12-22 12:15 GMT

దృశ్యం... సస్పెన్స్ థ్రిల్లర్లలో ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ అనే చెప్పాలి. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్ లో రూపొందిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినీ ప్రియులను తెగ మెప్పించింది. గ్రిప్పింగ్ కంటెంట్ తో అలరించిన ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

తొలి రెండు భాగాలు భారీ విజయం సాధించడంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయాలు అందుకున్నాయి. దీంతో ఇప్పుడు అంతా మూడో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే దృశ్యం-3 అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి.

క్యాస్టింగ్ వేరైనా ఒకేసారి థియేటర్స్ లోకి విడుదల చేస్తారని టాక్ వినిపించింది. హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ముందు ప్రకటించేందుకు.. మాలీవుడ్ వెర్షన్ నిర్మాతలు ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే మలయాళం వెర్షన్ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం మేకర్స్ శరవేగంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు.

త్వరలో విడుదల తేదీ ప్రకటన వస్తుందని తెలుస్తుండగా.. ఇప్పుడు హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ఖరారు అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా యాక్ట్ చేస్తుండగా.. విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 2, 2026న విడుదల కానుందని స్పెషల్ టీజర్ తో అనౌన్స్ చేసింది.

అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్న హిందీ దృశ్యం 3లో టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇశితా దత్తా, మృణాల్ జాదవ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్ సమర్పిస్తుండగా, పనోరమా స్టూడియోస్ బ్యానర్ పై అలోక్, అజిత్, అభిషేక్ పాఠక్, కుమార్ పాఠక్ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు మాలీవుడ్ వెర్షన్ షూటింగ్ కూడా పూర్తవడంతో.. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేటట్లు ఉన్నారు. అప్పుడు మలయాళం నిర్మాతలు చెప్పినట్లు వచ్చిన వార్తలు ప్రకారం.. మాలీవుడ్ వెర్షన్ కూడా అక్టోబర్ 2నే వస్తుందేమో చూడాలి.

అదే సమయంలో తెలుగు, తమిళ వెర్షన్ల ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. టాలీవుడ్ వెర్షన్ లో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ వెర్షన్ లో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. మరి హిందీ వెర్షన్ డేట్ ఫిక్స్ అవ్వగా.. మిగతా భాషల్లో దృశ్యం 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News