పవన్ మ్యానరిజమ్ వదిలేయాల్సిందేనా!
'సర్దార్ గబ్బర్ సింగ్' టైప్ లో ఎంత మాత్రం ఉండకూడదని ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. దీంతో హరీష్ కూడా క్యారెక్టరైజేషన్ విషయంలో మార్పులు మొదలు పెట్టినట్లు వినిపిస్తుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్. ఆయన మ్యానరిజానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తల ఎగరేసినా...మెడ మీద చేయి పెట్టి రుద్దినా? అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఇప్పటి వరకూ నటించిన చాలా సినిమాల్లో ఆమ్యానరిజమ్ కనిపిస్తుంది. ఆయనతో ఏ డైరెక్టర్ సినిమా తీసినా మ్యానరిజమ్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటారు.
మరి అలాంటి క్రేజీ మ్యానరిజాన్ని పవన్ వదిలేయబోతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. అందుకు కారణం ఆయన రాజకీయ నాయకుడు కావడం ఒక ఎత్తైతే? ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉండటం మరో బలమైన కారణం కావొచ్చు. ఇటీవలే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లో మార్పులు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. అందులో హీరో పాత్ర డీసెండ్ గా ఉండాలలని...అలాగే ఆహార్యం పరంగానూ డిగ్నిటీ కనిపించాలని భావించారు.
'సర్దార్ గబ్బర్ సింగ్' టైప్ లో ఎంత మాత్రం ఉండకూడదని ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. దీంతో హరీష్ కూడా క్యారెక్టరైజేషన్ విషయంలో మార్పులు మొదలు పెట్టినట్లు వినిపిస్తుంది. అంతే కాదు పవన్ తదు పరి సినిమాల విషయంలోనే ఈ రూల్స్ ను మిగతా మేకర్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఆయన ఏ పాత్ర పోషించినా ఎంతో కొంత సమాజానికి ఉపయోగ పడేలా ఉండాలి.
హీరో పాత్రలో నెగిటివ్ షేడ్స్ అస్సలు కనిపించకూడదు. అలాగే సినిమా యువత మీద ప్రభావం చూపి స్తుంది కాబట్టి ఆ బాద్యత కూడా హీరో తీసుకుని పనిచేయాలి. ఈ కండీషన్ కూడా పవన్ కళ్యాణ పెట్టిందే. 'పుష్ప' లో అల్లు అర్జున్ పాత్రపై పీకే కామెంట్ తెలిసిందే. ఇప్పుడా కండీషన్స్ కూడా పవన్ కళ్యాణ్ కి కూడా అప్లై అవుతాయి. అందుకే పవన్ ముందుగానే అలెర్ట్ అయినట్లు కనిపిస్తుంది.