ముసుగుతో ప్రమోషన్.. ఇది నెక్స్ట్ లెవెల్..!

ఒక సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ఆ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలి. అది కూడా జనాల అటెన్షన్ ని సినిమా వైపు తిప్పుకునేలా అన్నమాట;

Update: 2025-08-02 07:36 GMT

ఒక సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ఆ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలి. అది కూడా జనాల అటెన్షన్ ని సినిమా వైపు తిప్పుకునేలా అన్నమాట. ఈమధ్య స్టార్ హీరో సినిమాలు సైతం ఇలా వెరైటీ ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఐతే లేటెస్ట్ గా అలాంటి ఒక క్రేజీ ప్రమోషనల్ యాస్పెక్ట్స్ తో ఒక సినిమా వస్తుంది. అదే పరదా. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ తెరకెక్కిన ఈ సినిమాను సినిమా బండి, శుభం సినిమాలు చేసిన ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు.

కింగ్ డమ్ థియేటర్ లో ముసుగు వేసుకున్న మహిళలు..

ఈ సినిమా ఆగస్టుసు 22న రిలీజ్ అవుతుంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా వస్తున్న ఈ మూవీని చిత్ర యూనిట్ వెరైటీగా ప్రమోట్ చేస్తుంది. సినిమా అంతా హీరోయిన్ ముసుగుతో కనిపిస్తుంది. అందుకే సినిమాకు టైటిల్ గా పరదా అని పెట్టారు. పరదా వెనక ఒక మహిళ జీవితం ఎలా ఉంటుంది అన్నది సినిమా కథ. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న కింగ్ డం థియేటర్ లో ముసుగు వేసుకున్న కొందరు మహిళలు పింక్ కలర్ శారీతో సినిమా చూశారు.

కింగ్ డం క్రౌడ్ లో ముసుగు మహిళల మీద అటెన్షన్ పడింది. ఇక ఆ తర్వాత లేటెస్ట్ గా మెట్రో ట్రైన్ లో ఈ ముసుగు మహిళలు కనిపించారు. మెట్రోలో కూడా అందరు వాళ్లనే చూస్తూ ఉన్నారు. ఐతే ఈమధ్య ఆడియన్స్ కూడా చాలా క్లవర్ అయ్యారు. ఇదేదో సినిమా ప్రమోషన్ అని ముందుగానే కనిపెట్టేస్తున్నారు. పరదా టీం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇంప్రెస్ చేస్తున్నాయి.

హీరోయిన్ పోస్టర్ ఉంటే..

ఈ సినిమా అసలైతే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా రిలీజ్ పై అనుపమ కాస్త ఎమోషనల్ అయ్యారు. హీరోయిన్ పోస్టర్ ఉంటే ఆడియన్స్ పెద్దగా రారంటూ ఆమె సినిమా ఈవెంట్ లో అన్నారు. ఐతే సినిమా బాగుంటే ఎవరి పోస్టర్ ఉన్నా వస్తారు. ఎలాంటి సినిమా అయినా ఎంకరేజ్ చేస్తారు. కచ్చితంగా ఈ ప్రమోషన్స్ పరదా టీం కి కలిసి వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు.

పరదాతో అనుపమ క్రేజీ అటెంప్ట్ చేస్తుంది. తెలుగులో పెద్దగా కెరీర్ జోష్ లేకపోయినా తన దాకా వచ్చిన అవకాశాలను కాదనకుండా చేస్తుంది అనుపమ. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో కిష్కింధపురి సినిమా కూడా చేస్తుంది అనుపమ.

Tags:    

Similar News