పాంచాలి పంచభర్తృక.. రాజేంద్రప్రసాద్ న్యూ కామెడీ గ్యాంగ్

టాలీవుడ్ లో ఇప్పుడు కామెడీ సినిమాల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంటోంది. డిఫరెంట్ టైటిల్స్ తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మన దర్శకులు.;

Update: 2026-01-07 12:03 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు కామెడీ సినిమాల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంటోంది. డిఫరెంట్ టైటిల్స్ తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మన దర్శకులు. ఆ స్టైల్ లోనే లేటెస్ట్ గా 'పాంచాలి పంచభర్తృక' అనే టైటిల్ తో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. టైటిల్ చూస్తుంటేనే ఇదొక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని క్లియర్ గా అర్థమవుతోంది.




రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గంగ సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకట్ దుగ్గిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయమైన పేరుకు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గ కామెడీని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది.

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడితో పాటు రోల్ రైడా, జెమినీ సురేష్, పృథ్వీ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. కామెడీ టైమింగ్ లో ఆరితేరిన వీరంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుండటంతో సిట్యుయేషనల్ హ్యూమర్ పక్కాగా ఉంటుందని భావిస్తున్నారు. క్యారెక్టర్ డ్రివెన్ కథలతో పాటు సెటైర్ కూడా ఈ సినిమాలో ప్రధాన బలంగా ఉండబోతోంది.

పోస్టర్ లో "లెస్ లాజిక్.. మోర్ మ్యాజిక్" అనే ట్యాగ్ లైన్ ను వాడటం విశేషం. అంటే లాజిక్కులు వెతకకుండా కేవలం నవ్వుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చేశారు. నేటి జనరేషన్ కు నచ్చేలా ట్రెండీ కామెడీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. బాబీ కెఎస్ఆర్ ఈ చిత్రానికి కథను అందించారు.

మ్యూజిక్ విషయానికి వస్తే మహేష్ నారాయణ, బిషేక్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజ్ పవన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. టెక్నికల్ గా కూడా సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నట్లు సమాచారం. మల్టిపుల్ క్యారెక్టర్స్ మధ్య ఉండే కన్ఫ్యూజన్ డ్రామా ఈ సినిమాకు హైలైట్ కానుందట.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ద సినిమాల మధ్య ఇలాంటి చిన్న సినిమాలు కంటెంట్ తో మెప్పిస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది. మరి ఈ 'పాంచాలి పంచభర్తృక' ఆడియన్స్ ను ఏ మేరకు నవ్విస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News