• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విదేశాల్లో కూడా పుష్ప 2...

విదేశాల్లో కూడా పుష్ప 2 సునామీ.. మైండ్ బ్లాక్ కలెక్షన్స్..

| పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన "పుష్ప 2: ది రూల్" కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.

By - Tupaki Desk
Update: 2024-12-06 07:57 GMT

పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన "పుష్ప 2: ది రూల్" కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే, ఈ చిత్రం పలు దేశాల్లో భారీ కలెక్షన్లతో అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్ దేశాల్లో కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.

ఆస్ట్రేలియాలో పుష్ప 2 విడుదల మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటింది. 134 థియేటర్లలో మొదటి రోజు $653,257 వసూలు చేయగా, రెండో రోజు $375,917 కలెక్షన్లు రాబట్టింది. ఈ రేంజ్ కలెక్షన్లు ఆస్ట్రేలియాలో భారతీయ సినిమాలకు ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా కేవలం మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి 1 మిలియన్ మార్కును అందుకుంది, ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి.

న్యూజిలాండ్‌లో, మొదటి రోజు $93,181 వసూలు చేసిన పుష్ప 2, రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. 34 థియేటర్లలో $68,444 వసూళ్లు సాధించి, మొదటి రోజు స్థాయిలోనే రెండో రోజు కూడా కొనసాగించడం విశేషం. ఈ చిత్రం న్యూజిలాండ్‌లో పక్కా హిట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. యూకే మరియు ఐర్లాండ్ లో కూడా రెండో అత్యంత పెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్ సాధించింది. అక్కడ 484,250 డాలర్లు రాబట్టిన ఈ చిత్రం మార్కెట్లో భారతీయ చిత్రాలకు కొత్త ప్రమాణాలు సెట్ చేస్తోంది. 191 థియేటర్లలో ఈ కలెక్షన్లు సాధించడం విశేషం.

గల్ఫ్ దేశాల్లో కూడా ప్రీమియర్ షోల ద్వారా $500K కలెక్షన్ సాధించింది. ఇంకా చాలా ప్రాంతాల్లో థియేటర్ లెక్కలు అందని కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడి అభిమానుల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున స్పందన రావడం విశేషం. మొత్తానికి, "పుష్ప 2" విదేశీ మార్కెట్లో తనదైన ముద్ర వేశింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 3.29 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం, మొదటి రోజు 719 థియేటర్లలో 1.11 మిలియన్ కలెక్షన్ సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మార్కెట్స్ లో ఈ చిత్రం విజయం సాధించడం చూస్తుంటే, ఇది రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సెట్ చేయనుందని అనిపిస్తుంది. "పుష్ప 2: ది రూల్" తో అల్లు అర్జున్ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmika 
  • Sukumar 
  • Pushpa2collections 
  • Pushpa2review 
  • Overseasboxoffice 
  • Pushpa2Therule 
  • Pushparajmania 
  • Panindia 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS