• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓ మై గాడ్! 20 సీన్స్‌లో...

ఓ మై గాడ్! 20 సీన్స్‌లో శివుడి వేశం మార్చ‌క‌పోతే?

| సినిమాలో అక్షయ్ పాత్రను శివుడి నుండి దూత్‌గా మార్చాలని కోరుతోంది

By - Tupaki Desk
Update: 2023-07-31 04:12 GMT

అక్షయ్ కుమార్ న‌టించిన‌ భారీ చిత్రం 'OMG 2' ఈ సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా విడుదలకు సిద్ధమవుతోంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత అక్కీ భారీ విజ‌యంపై క‌న్నేశాడు. ఈ చిత్రం 11 ఆగస్ట్ 2023న సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2'తో పోటీప‌డుతూ థియేటర్లలోకి విడుద‌ల‌వుతోంది. OMG 2లో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తాడు.

అయితే తాజా స‌మాచారం మేర‌కు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలో అక్షయ్ పాత్రను శివుడి నుండి దూత్‌(దూత లేదా ఇన్ఫార్మ‌ర్)గా మార్చాలని కోరుతోంది. గత వారం సెన్సార్ బోర్డ్ సమీక్ష కమిటీ ఈ చిత్రానికి చేసిన 20 మార్పులు తొలగింపులలో ఈ సవరణ ఒకటిగా కనిపిస్తోంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం.

OMG 2 వాయిదా నిజ‌మా?

నిజానికి ఓమైగాడ్ 2 సినిమా ట్రైలర్, పోస్టర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. OMG 2 నిర్మాతలు వాస్తవానికి అక్షయ్ కుమార్ శివుడి నీలి రంగు చర్మాన్ని కలిగి ఉన్నట్లు చూపించే అనేక సన్నివేశాలను మార్చాలి లేదా తొలగించాలి. ఈ చిత్రంలో కీల‌క‌ మార్పులు చేయాలని మేకర్స్ నిర్ణయించుకుంటే ఆగస్ట్ 11 విడుదలకు ఆస్కారం ఉండ‌ద‌ని అంచ‌నా. ఇంకా సోర్స్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ''సెన్సార్ వాళ్లు చెప్పిన సీక్వెన్స్‌లను తీసివేయాలి లేదా నీలి రంగును డిజిటల్‌గా మార్చాలి. ఎలాగైనా దీనికి అదనపు సమయంతో పాటు నిధుల అవ‌సరం పడుతుంది'' అని తెలుస్తోంది.

ఈ వారం ప్రారంభంలో CBFC నిర్దేశించిన మార్పుల కారణంగా సినిమా థియేట్రిక‌ల్ విడుద‌ల‌ను వాయిదా వేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారని ఒక నివేదిక పేర్కొంది. కమిటీ సూచించిన మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలని ..సినిమా స‌రైన ప్రమోషన్‌లను విస్త్ర‌తంగా చేయాల‌ని భావిస్తున్నందున విడుదల తేదీని ఆగస్టు 11 నుండి మార్చాలని మేకర్స్ అభిప్రాయపడ్డారు. OMG 2 అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమిత్ రాయ్ రచన దర్శకత్వంలో తెర‌కెక్కిన భారతీయ హిందీ భాషా వ్యంగ్య హాస్య-నాటక చిత్రమిది. ప్ర‌స్తుతానికి కొత్త‌ విడుద‌ల తేదీపై ఎలాంటి అప్ డేట్ రాలేదు.

Tags:    
  • Omg2movie 
  • Akshaykumar 
  • Pankajtripathi 
  • Yamigautham 
  • Omg2 
  • Amitrai 
  • Censorboard 
  • Gaddar2 
  • Omg2film 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS