నేను ఎలా బ్రతికిపోయానో నాకే తెలీదు: ఓంరౌత్

రామాయ‌ణ ఇతిహాస క‌థ‌ను పెద్ద‌తెర‌పై అత్యంత చెత్త‌గా చూపించిన‌ ద‌ర్శ‌కుడిగా ఓంరౌత్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.;

Update: 2025-09-23 03:49 GMT

రామాయ‌ణ ఇతిహాస క‌థ‌ను పెద్ద‌తెర‌పై అత్యంత చెత్త‌గా చూపించిన‌ ద‌ర్శ‌కుడిగా ఓంరౌత్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా హీరో విలువైన స‌మ‌యాన్ని, శ్ర‌మ‌ను అతడు దుర్వినియోగం చేసాడు. ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకున్న త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఓంరౌత్ అండ‌ర్ గ్రౌండ్ కి వెళ్లాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. చాలా కాలం పాటు అత‌డు బ‌య‌ట క‌నిపించ‌క‌పోయేస‌రికి చాలా రూమ‌ర్లు వినిపించాయి.

ఒక గొప్ప ఇతిహాస క‌థ‌ను అత్యంత చెత్త‌గా చూపించిన ద‌ర్శ‌కుడిగా అత‌డిని ఎవ‌రూ క్ష‌మించేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డంతో అత‌డు అన్నిటికీ దూరంగా ఉన్నాడు. అయితే అదంతా ముగిసిన గ‌తం. వ‌ర్త‌మానంలో ఓంరౌత్ ఏం చేస్తున్నాడు? అంటే అత‌డు తెలివిగా కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు త‌న వాయిస్ ని నెమ్మ‌దిగా రైజ్ చేస్తున్నాడు. ఫ్లాప్ మూవీ ఆదిపురుష్ గురించి మాట్లాడాడు.

ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవ‌రైనా ఉద్ధేశ పూర్వ‌కంగా త‌ప్పు చేయ‌రు.. త‌ప్పులు జ‌రుగుతాయి. నేను ప్ర‌తిసారీ చెబుతుంటాను.. విజ‌యం మీకు చాలా నేర్పిస్తుంది. ప‌రాజ‌యం ఇంకా ఎక్కువ నేర్పిస్తుంది.. కాబ‌ట్టి దాని నుంచి బ‌ట‌య‌ప‌డాలి. త‌ప్పుల నుంచి నేర్చుకుని తిరిగి రిపీట‌వ్వ‌కుండా చూసుకోవ‌డం ప్రార్థించ‌డం అదే మ‌న‌కు చివ‌రి అవ‌కాశం.. అని చెప్పారు. ప‌రాజ‌యంతో తీవ్ర ఉద్వేగానికి గుర‌వుతాం. నా కంటే నా చుట్టూ ఉన్న‌వారు, స్నేహితులు, బంధుమిత్రులు దీనిని త‌ట్టుకోలేరు. వీట‌న్నిటికీ స‌మాధానం చెప్పాలి.. అది కూడా మంచి సినిమా తీసి నేను చూపించాలి.. అని గుర్తు చేసుకున్నాడు ఓంరౌత్. నేను ఎలా బ్రతికిపోయానో నాకు తెలియదు. బహుశా నా కుటుంబం, స్నేహితుల నుంచి లభించిన మద్దతు వల్ల కావచ్చున‌ని కూడా అన్నాడు.

ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వానికి బ్రేక్ ఇచ్చినా కానీ, క‌ళాత్మ‌క క‌థ‌ల‌ను ఎంపిక చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజా చిత్రం `ఇన్‌స్పెక్టర్ జెండే`ను అత‌డు స్వ‌యంగా నిర్మించారు. ఈ చిత్రం విజ‌యాన్ని సాధిండం అత‌డికి పెద్ద ఊర‌ట‌. తదుపరి ధనుష్ తో `కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓంరౌత్ ప్ర‌య‌త్నాలు చూస్తుంటే చాలా తెలివిగా కంబ్యాక్ ని ప్లాన్ చేసాడ‌ని కూడా అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News