'ఆదిపురుష్‌' దర్శకుడు అంతా కన్ఫ్యూజన్‌..!

ప్రభాస్‌ను 'ఆదిపురుష్‌'గా చూపించిన దర్శకుడు ఓం రౌత్‌ను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు.;

Update: 2026-04-03 09:30 GMT

ప్రభాస్‌ను 'ఆదిపురుష్‌'గా చూపించిన దర్శకుడు ఓం రౌత్‌ను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్‌ సినిమా ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ముఖ్యంగా నాసిరకం గ్రాఫిక్స్ వర్క్‌ ప్రభాస్‌ పరువు పోయేలా చేసింది అంటూ చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభాస్‌ అభిమానులు ఓం రౌత్‌ కనిపిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా ఫైర్ అవుతూ ఉంటారు. ఆదిపురుష్ ప్రభావంతో ఓం రౌత్‌ ఇప్పటి వరకు సినిమాను మొదలు పెట్టలేదు. దాదాపు మూడు ఏళ్లు అవుతున్నా కూడా ఓం రౌత్‌ కొత్త సినిమా పట్టాలెక్కలేదు అంటే ఏ స్థాయిలో ఆ సినిమా ఆయనకు నష్టాన్ని మిగిల్చిందో అర్థం చేసుకోవచ్చు. ఓం రౌత్ సినిమా అనగానే సౌత్‌ ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులు సౌతం బాబోయ్ అన్న ఫీల్‌ను వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు ఆగిన ఓం రౌత్‌ ఎట్టకేలకు కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు.

కలాం జీవిత చరిత్ర ఆధారంగా...

గత ఏడాదిలోనే ఓం రౌత్‌ తన తదుపరి సినిమాను ధనుష్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. మాజీ రాష్ట్రపతి, మిసైల్‌ మ్యాన్‌ అయిన అబ్దుల్‌ కలాం జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తీసేందుకు ఓం రౌత్‌ సిద్ధం అవుతున్నాడనే ప్రకటన వచ్చింది. ఆ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించేందుకు గాను ఏర్పాట్లు చేస్తోందనే వార్తలు వచ్చాయి. ధనుష్ సైతం కలాం పాత్రకు ఓకే చెప్పాడని కోలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. 2025లోనే పట్టాలెక్కి, 2026 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా కలాం ప్లాన్‌ చేస్తున్నాడని, ధనుష్ నుంచి అందుకు తగ్గట్లుగా డేట్లు తీసుకున్నాడు అంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ 2025 పూర్తి అయినా ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ఈ ఏడాదిలో అయినా సినిమా పట్టాలెక్కుతుందా అనే విషయమై క్లారిటీ లేకపోవడంతో సినిమా క్యాన్సల్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి.

ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌...

ఓం రౌత్‌ తన కలాం ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాడు అంటూ వస్తున్న వార్తలు నిజం అన్నట్లుగా, ఇప్పుడు కొత్త వార్తలు పుట్టుకు వచ్చాయి. ఓం రౌత్‌ ఆదిపురుష్‌ సినిమాకు ముందు తానాజీ సినిమాను చేసిన విషయం తెల్సిందే. అజయ్‌ దేవగన్‌తో ఓం రౌత్‌ చేసిన తానాజీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అందుకే మరోసారి వీరి కాంబో మూవీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరిది హిట్‌ పెయిర్ కనుక తప్పకుండా మరో విజయం వీరి కాంబోలో నమోదు అయ్యే అవకాశం ఉంది అనేది చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆదిపురుష్‌ తర్వాత గ్యాప్‌ ఇచ్చిన ఓం రౌత్‌ ఇప్పుడు అజయ్ దేవగన్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఒక కథను చెప్పడం, ఆ కథపై హీరో అజయ్ దేవగన్ చాలా ఆసక్తి కనబరచడం జరిగిందట. అందుకే ఈ ఏడాదిలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఆదిపురుష్ సినిమా ఫలితం...

ఆదిపురుష్ వంటి డిజాస్టర్‌ తర్వాత ఓం రౌత్‌ తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ మరోసారి ప్రభాస్‌తో సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పట్లో ప్రభాస్‌ ఆయనకు డేట్లు ఇచ్చేందుకు రెడీగా లేడు. పైగా ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ఉండటం అనేది సాధ్యం కాదని అంతా బలంగా నమ్ముతున్నారు. అందుకే అజయ్‌ దేవగన్‌తో ఓం రౌత్‌ మూవీ అనగానే ఈ కాంబో కావాల్సిందే అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే కలాం ప్రాజెక్ట్‌ను చేయబోతున్నట్లుగా చెప్పి, ధనుష్‌ తో చర్చలు జరిపి, ఇప్పుడు మళ్లీ అజయ్‌ దేవగన్‌తో సినిమాను మొదలు పెట్టేందుకు ఓం రౌత్‌ రెడీ అవుతున్నాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌లో గందరగోళంను క్రియేట్‌ చేస్తున్నాయి. ఓం రౌత్‌ ఏం చేయాలి అనుకుంటున్నాడో కనీసం ఆయనకు అయినా తెలుసా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా అనిపిస్తోందని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News