మల్టీస్టారర్ మూవీతో హిట్.. కానీ ఏం లాభం?

సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు మంచి విజయాన్ని అందుకుంటే, సాధారణంగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతుంది.

Update: 2026-06-16 17:30 GMT

సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు మంచి విజయాన్ని అందుకుంటే, సాధారణంగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమా చేస్తారా? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనే చర్చలు మొదలవుతాయి. నిర్మాతలు కూడా అలాంటి దర్శకులతో పని చేయడానికి ముందుకొస్తారు. అయితే తాజాగా ఓ మల్టీస్టారర్ మూవీతో హిట్ అందుకున్న డైరెక్టర్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా సక్సెస్ గా నిలిచిన సినిమా తర్వాత దర్శకుడి కెరీర్ మరింత వేగం అందుకోవాలి. వరుస అవకాశాలు రావాలి. కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడాలి. కానీ సదరు దర్శకుడి విషయంలో మాత్రం పరిస్థితి ఆశించిన విధంగా లేదని తెలుస్తోంది. హిట్ అందుకున్నప్పటికీ ఆయన అప్ కమింగ్ మూవీ ఇప్పటికీ పట్టాలెక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆ డైరెక్టర్ గత కొన్ని నెలలుగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ చుట్టూనే తిరుగుతున్నారని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఆయనతో సినిమా చేస్తామని ఆ సంస్థ నుంచి హామీ వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో తదుపరి ప్రాజెక్టుపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ నెల నెలలు గడుస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదట.

స్టోరీ డిస్కషన్స్ పేరుతో సమావేశాలు జరుగుతున్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏ స్టోరీ ముందుకు వెళ్లాలి? ఏ హీరోకి ఆ కథ సరిపోతుంది? అనే అంశాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయట. అయితే ఆ చర్చలు ఇంకా సక్సెస్ అవ్వకపోవడంతో దర్శకుడు కూడా నిరాశలో ఉండి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఆ నిర్మాణ సంస్థకు బయట నుంచి వచ్చే అనేక స్టోరీస్ కూడా సదరు దర్శకుడే ముందుగా వింటున్నారట. కథల్లో మార్పులు సూచించడం, ఏ ప్రాజెక్ట్‌కు అవకాశం ఉందో పరిశీలించడం వంటి పనులు కూడా ఆయన బాధ్యతల్లో భాగమయ్యాయని తెలుస్తోంది. దీంతో దర్శకుడి అసలు పని అయిన సినిమా తెరకెక్కించడం కంటే, స్క్రిప్టుల పరిశీలనకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి.

ఒక విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకుడి నుంచి కొత్త ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూడటం సహజం. కానీ హిట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన నుంచి నెక్స్ట్ మూవీ గురించి సరైన అప్డేట్ రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవకాశాలు ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు ఆలస్యం కావడం వల్ల వాల్యూ టైమ్ వేస్ట్ అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

అయితే ఆ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనేది అధికారిక ప్రకటన వెలువడే వరకు చెప్పడం కష్టం. అయినప్పటికీ మల్టీస్టారర్ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించి మళ్లీ మెగాఫోన్ పట్టే రోజెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో హిట్ వచ్చింది.. కానీ ఆ సక్సెస్ దర్శకుడి కెరీర్‌ కు నిజంగా ఎంత ఉపయోగపడిందని ప్రశ్న వినిపిస్తోంది.

Tags:    

Similar News