• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ అశ్విన్ విజయాల వెనుక...

నాగ్ అశ్విన్ విజయాల వెనుక అస‌లు రహస్యమిదేనా?

| అయితే నాగ్ అశ్విన్ మాత్రం పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని అనుసరిస్తానని చెప్పారు.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-06-16 22:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్ట‌ర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్, కేవలం మూడు సినిమాలతోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 AD వంటి విభిన్న సినిమాల‌తో తన క్రియేటివిటీని ప్రూవ్ చేసుకున్న నాగి, ఇప్పుడు డైరెక్ట‌ర్ గానే కాకుండా నిర్మాతగానూ స‌క్సెస్‌ఫుల్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నిర్మించిన సింగ్ గీతం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

సినిమా నిర్మాణం అనేది బయటకు కనిపించేంత సులభమైన ప్రక్రియ కాదు. ముఖ్యంగా వందలాది మంది టీమ్‌తో, భారీ బడ్జెట్‌లతో రూపొందే సినిమాల విష‌యంలో ప్రతి రోజూ కొత్త ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. షెడ్యూళ్ల ఒత్తిడి, టెక్నిక‌ల్ ఇష్యూస్, అనుకోని మార్పులు, సమయాభావం వంటి అంశాలు డైరెక్ట‌ర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది డైరెక్ట‌ర్లు తమ సహనాన్ని కోల్పోయిన సందర్భాలు ఇండ‌స్ట్రీలో తరచూ వినిపిస్తుంటాయి.

అయితే నాగ్ అశ్విన్ మాత్రం పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని అనుసరిస్తానని చెప్పారు. సెట్స్‌లో ఎవరినీ తిట్టడం గానీ, అరవడం గానీ చేయనని వెల్లడించిన ఆయన, దానికి వెనుక ఉన్న ఆలోచనను కూడా వివరించారు. ఒకవేళ కోపంతో రియాక్ట్ అయితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని, అలాగే అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సినిమా అనే ఒకే టార్గెట్ కోసం కష్టపడుతుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్ లో ఉండవని, వాటికి ఎన్నో రీజ‌న్స్ ఉండొచ్చని పేర్కొన్నారు.

ఇతరులపై కంటే తనపైనే తాను ఎక్కువగా కోపపడతానని కూడా నాగి ఈ సంద‌ర్భంగా చెప్ప‌డం విశేషం. చాలా సందర్భాల్లో ప్రాబ్ల‌మ్స్‌ను ముందుగానే గుర్తించినప్పటికీ, సరైన టైమ్ లో వాటికి రియాక్ట్ అవ‌లేక‌పోయాన‌నే ఫీలింగ్ తనను బాధిస్తుందని ఆయన తెలిపారు. ఇది ఆయన వ్యక్తిత్వంలోని ఆత్మపరిశీలనను ప్రతిబింబించే అంశంగా చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన సాధించిన విజయాల వెనుక ఈ మానసిక ధోరణి కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహానటి వంటి ఎమోష‌న‌ల్ బయోపిక్ నుంచి కల్కి 2898AD వంటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాను స‌క్సెస్‌ఫుల్ గా తెరకెక్కించడం వెనుక కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. లీడ‌ర్‌షిప్ అంటే గట్టిగా అరవడం లేదా భయపెట్టడం కాదని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండి టీమ్‌ను ముందుకు నడిపించడం అని నాగ్ అశ్విన్ మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. డైరెక్ట‌ర్ గా ఆయన స‌క్సెస్‌ల‌కు కారణం కేవలం విజన్ మాత్రమే కాదు, ఆ విజన్‌ను ప్రశాంతతతో అమలు చేసే విధానమూ కావచ్చని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    
  • nagashwin 
  • tollywood 
  • mahanati 
  • kalki2898ad 
  • evadesubramanyam 
  • filmnews 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS