ధోతీలో పూజా హెగ్డే లేటెస్ట్ లుక్!

పూజా హెగ్డే ధరించిన ఈ సెట్ ధర సుమారుగా రూ.58 వేలకు పైమాటే. ముఖ్యంగా ఈ డ్రెస్ ను ప్రత్యేకించి ముంబైలోని కళాకారులు చేతితో తయారుచేస్తారు.

Update: 2026-06-16 17:51 GMT

అవకాశం లభించాలే కానీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ ముందుండే బుట్టబొమ్మ అలియాస్ పూజా హెగ్డే గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా దాదాపు డిజాస్టర్ గానే మిగలడంతో అమ్మడిపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. ముఖ్యంగా ఆచార్య, రెట్రో , ఎఫ్ 3, బీస్ట్ , సర్కస్, దేవా ఇలా పలు చిత్రాలు చేసింది కానీ ఏవి కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. ఇక గత ఏడాది కూలీ సినిమాలో మోనిక అనే స్పెషల్ సాంగ్ లో అలరించి ఆకట్టుకుంది.

 

సోషల్ మీడియాలో పూజా హెగ్డే సందడి..

అయితే హీరోయిన్ గా మాత్రం ఈమెకు అవకాశాలు తలుపు తట్టలేదని చెప్పాలి. దీనికి తోడు ఇటీవల హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అమ్మడి ఇమేజ్ ను పెంచలేకపోయింది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న ఈమె.. మరొకవైపు తన లేటెస్ట్ ట్రెండింగ్ అవుట్ ఫిట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

స్టైలిష్ లుక్ లో పూజ హొయలు..

ది లిటిల్ బ్లాక్ బో డిజైనర్ లేబుల్ కి సంబంధించిన రిలాక్స్ అండ్ క్రీమ్ పెప్లమ్, ధోతీ సెట్ ధరించి తన స్టైలిష్ లుక్కుతో అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది.ముఖ్యంగా ఇండో వెస్ట్రన్ నేపథ్యంలో డిజైన్ చేసిన ఈ ధోతీ పై భాగంలో లేస్ ను పోలి ఉండేలా డోరీ దారం సహాయంతో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన టాప్ ను ఆమె ధరించింది. దీనిపైన గోల్డెన్ కలర్ దారంతో జర్దోసి గులాబీలు అలాగే టీ స్టాండ్ ముత్యాలతో మరింత అందంగా డిజైన్ చేశారు. ఇక దీనికి సరిపోయే బాటమ్ డ్రేప్ ధోతీ సిల్హౌట్ తో స్టైల్ చేయబడిన ఈ కో - ఆర్డ్ సెట్ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. మొత్తానికి అయితే క్రీమ్ కలర్ ధోతీ సెట్ ఫ్యాషన్ లవర్స్ ను విపరీతంగా అలరిస్తోంది.

 

డ్రెస్ ఖరీదు ఎంతంటే?

పూజా హెగ్డే ధరించిన ఈ సెట్ ధర సుమారుగా రూ.58 వేలకు పైమాటే. ముఖ్యంగా ఈ డ్రెస్ ను ప్రత్యేకించి ముంబైలోని కళాకారులు చేతితో తయారుచేస్తారు. కాబట్టి ఈ ధోతీ సెట్ డెలివరీకి సాధారణంగా ఆరు నుండి 8 వారాల సమయం పడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ట్రెండీ అవుట్ ఫిట్ లో ఈమె షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అమ్మడి ఆశలన్నీ వాటి పైనే..

పూజా హెగ్డే తదుపరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మూవీ కాంచన ఫ్రాంచైజీలో భాగంగా కాంచన 4 లో నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో తెలుగులో డీక్యూ41 పేరిట ఒక సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . ఈ రెండు చిత్రాలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరిగా నటించిన జననాయగన్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. మరి ఈ చిత్రాలతో పూజ హెగ్డే మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News