గోవిందా హెయిర్ ప్యాచ్‌పై భార్య సునీత షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా భార్య సునీతా అహుజా బాహాటమైన.. చమత్కారభరిత సంభాషణలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

Update: 2026-06-16 18:30 GMT

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా భార్య సునీతా అహుజా బాహాటమైన.. చమత్కారభరిత సంభాషణలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భర్త గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గోవిందా హెయిర్ ప్యాచ్ (జుట్టు) గురించిన ముచ్చట్లు, గతంలో తాను చేసిన గోట్ కామెంట్‌పై నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌కు సునీత తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సాధార‌ణంగా శారీరక మార్పులు.. వృద్ధాప్య లక్షణాలను సమాజం ముందు దాచడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ సునీతా అహుజా మాత్రం గోవిందా హెయిర్ ప్యాచ్ వాడుతున్నారనే విషయాన్ని సరదాగా చెప్పేసారు.

`ఇందులో దాచడానికి ఏముంది? బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు హెయిర్ ప్యాచ్‌లు, ట్రాన్స్‌ప్లాండేషన్లు చేయించుకుంటారు. అది స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చాలా సాధారణమైన విషయం` అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే `గోట్` వ్యాఖ్యలపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను గోవిందాను ఉద్దేశించి గోట్ అని అన్నప్పుడు, కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని జంతువైన మేకతో పోల్చుతూ ట్రోల్ చేశారని నవ్వుతూ చెప్పారు. తాను ఆయనను ఆల్‌టైమ్ గ్రేట్ యాక్టర్‌గా అభివర్ణించడానికే ఆధునిక పదజాలాన్ని వాడానని.. అంతే కానీ కొందరు నెటిజన్లు భావించినట్లు కాదని చమత్కరించారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే ట్రోల్స్ ..నెగెటివిటీని తాను అస్సలు పట్టించుకోనని సునీత స్పష్టం చేశారు. సాధారణంగా స్టార్ వైఫ్స్ మీడియా ముందు చాలా జాగ్రత్తగా, డిప్లొమాటిక్‌గా మాట్లాడటానికి మొగ్గు చూపుతారు. కానీ సునీత మాత్రం ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికే ఇష్టపడతారు. ఈ ముక్కుసూటితనమే ఆమెను ఇంటర్వ్యూలలో అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా స్టార్ వైఫ్స్ టాక్ షోలు, పాడ్‌కాస్ట్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

బాలీవుడ్ పీఆర్ మేనేజ్‌మెంట్ సృష్టించే కృత్రిమ ఇమేజ్‌లకు భిన్నంగా పంచుకునే ఇంటర్నల్ విషయాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. సునీత - గోవిందాల మధ్య ఉన్న సుదీర్ఘమైన బంధం, ఒకరినొకరు ఆటపట్టించుకునే నైజం ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి బయటపడింది. సినీ రంగంలో ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా? వ్యక్తిగత జీవితంలో సాధారణ భార్యాభర్తల్లాగే ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం వారిలోని సహజత్వాన్ని చూపిస్తుంది. సునీతా అహుజా చేసిన వ్యాఖ్యలు వినోదాన్ని పంచడమే కాదు. సెలబ్రిటీల జీవితాల్లోని కొన్ని నిజాలను దాచకుండా సమాజం ముందుకు తీసుకురావడం విశేషం. ట్రోలర్లకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Tags:    

Similar News