మాజీ లేడీ ఎంపీ కిల్ల‌ర్ ఫోజులు!

తాజాగా మ‌రోసారి న‌లుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించింది. అయితే టోన్డ్ లెగ్స్ సొగ‌సును కూడా నూస్ర‌త్ తెర‌ప‌రిచింది.;

Update: 2025-06-15 03:00 GMT

సినీగ్లామర్ రాజ‌కీయాల్లోకి రావ‌డం స‌హ‌జం. చాలామంది అగ్ర‌తార‌లు రాజ‌కీయ రంగంలో ఎదిగారు. అదే కోవ‌కు చెందుతుంది న‌టి నుష్ర‌త్ జ‌హాన్. బెంగాలీ మాజీ ఎంపీ నుస్రత్ జహాన్ రాజ‌కీయాలు- సినిమాలు రెండు రంగాల్లోను ముందుకు సాగుతోంది. నూస్ర‌త్ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఈ భామ‌ హీటెక్కించే ఫోటోషూట్లు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశం. నూష్ర‌త్ కి ఇన్ స్టాగ్రామ్ లో 28ల‌క్ష‌లు పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ భామ ఫోటోషూట్ల‌కు భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. రోజు రోజుకి అనుచ‌రుల సంఖ్య‌ పెరుగుతూనే ఉంది.

 

ఇటీవల బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో క‌నిపిస్తున్న నూస్ర‌త్ టోన్డ్ ఫిజిక్ కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొడుతోంద‌ని చెప్పాలి. తాజాగా మ‌రోసారి న‌లుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించింది. అయితే టోన్డ్ లెగ్స్ సొగ‌సును కూడా నూస్ర‌త్ తెర‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

 

నిజానికి నుష్ర‌త్ జ‌హాన్ పేరు కొన్నేళ్ల క్రితం వివాదాల‌లోకొచ్చింది. ఒక బిడ్డ‌కు త‌ల్లి అయినా కానీ, ఈ భామ ఎందులోను త‌గ్గేదేలే! అని నిరూపిస్తోంది. చూస్తుంటే నూస్ర‌త్ తిరిగి క‌థానాయిక‌గా పెద్ద అడుగు వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆరంభం బుల్లితెర సూపర్ స్టార్ గా వెలిగిన నుష్ర‌త్ గ్లామర్ కోణం అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది. నూష్ర‌త్ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో నిరంత‌రం యువ‌త‌రంలో ఫాలోయింగ్ పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

గ్రేస్ అండ్ బోల్డ్ గ్లామర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో నూస్ర‌త్ మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఈ భామ‌ మోనోక్రోమ్ లుక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా, భారీ పరిమాణంలో ఉన్న నల్ల జాకెట్‌ ఆఫ్-షోల్డర్ లుక్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Tags:    

Similar News