'వార్‌ 2' అంచనాలు పెంచే ఆ ఒక్కటీ రెడీ

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో 'వార్‌ 2' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.;

Update: 2025-06-25 17:30 GMT

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో 'వార్‌ 2' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న వార్‌ 2 లో ఎన్టీఆర్‌ విలన్‌ పాత్రను పోషిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. పూర్తిగా విలన్‌ పాత్ర కాకపోవచ్చని, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అయ్యి ఉంటుందని, క్లైమాక్స్‌లో పాత్రలో మార్పు ఉండవచ్చని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది. ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. సరిగ్గా 50 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్ హడావిడి మాత్రం మొదలు పెట్టలేదు. సౌత్‌ సినిమాలు విడుదలకు రెండు నెలల నుంచే ప్రమోషన్‌ సందడి షురూ చేస్తారు.

ఆ మధ్య ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమా స్థాయి తగ్గిందంటూ విశ్లేషకులు సైతం కామెంట్స్ చేశారు. అయితే టీజర్‌ చేసిన డ్యామేజీని కంట్రోల్‌ చేసి కచ్చితంగా సినిమాకు మేకర్స్‌ హైప్‌ తీసుకు వస్తారనే విశ్వాసంను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాట ఉంటుందట. ఆ ఒక్క పాటలో హృతిక్‌ తో కలిసి ఎన్టీఆర్‌ డాన్స్ చేస్తాడు. ఆ పాట కచ్చితంగా ఆ భాష.. ఈ భాష అని కాకుండా అన్ని భాషల నుంచి ప్రేక్షకులను సినిమా వైపు తిప్పుకునేలా చేస్తుందట. అందుకే ఈ సినిమా నుంచి ఆ పాట కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ పాట గురించి బాగా హైప్‌ ఇస్తున్నారు.

హృతిక్‌ గాయం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఆ పాట దాదాపు రెడీ కావడంతో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాటలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయని, అలాగే మంచి డాన్స్‌ను కూడా ప్రేక్షకులు చూస్తారని సమాచారం అందుతోంది. పాట సౌత్‌ ఆడియన్స్‌ను సైతం మెప్పించే విధంగా ఉంటుంది. వార్‌ 2 స్థాయిని పెంచాలంటే ఆ పాట మరో లెవల్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పాట విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ పాట విడుదల కావడం ఖాయం, ఆ తర్వాత సినిమా స్థాయి పెరగడం కూడా ఖాయం అని బాలీవుడ్‌ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తుంది.

ఆగస్టు 15న వార్‌ 2 తో పాటు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూలీ సినిమాను సైతం భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. కూలీ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌ ఉన్న సినిమా కావడంతో కచ్చితంగా వార్‌ 2 సినిమాకు కొంత డ్యామేజీ కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే వార్ 2 సినిమాను అంతకు మించి అన్నట్లుగా ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పాట విడుదల తర్వాత ట్రైలర్‌ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా వార్ 2 మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ స్పై థ్రిల్లర్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇస్తాడని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News