ఎన్టీఆర్ వార్ 2.. దేవర ట్వీట్ వేశాడోచ్..!

వార్ 2 ప్రమోషన్స్ విషయంలో కూడా యస్ రాజ్ మేకర్స్ క్రేజీ ప్లానింగ్ లో ఉన్నారట. ఈ సినిమా ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారట.;

Update: 2025-07-07 14:40 GMT

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్న సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. RRR సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ చూసి వార్ 2 లో ఆయన అయితే బాగుంటాడని అలా ఫిక్స్ చేశారు. ఈమధ్య రిలీజైన టీజర్ చూసి సౌత్ ఆడియన్స్ అంతా ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సూపర్ అనేశారు. ఇక ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈ క్రమంలో వార్ 2 షూటింగ్ పూర్తైందని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. వార్ 2 పూర్తైంది.. దీని నుంచి చాలా తీసుకెళ్తున్నాను.. హృతిక్ రోషన్ సెట్ లో ఉండటం ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. ఆయన్ను ఎల్లప్పుడూ అభిమానిస్తాను. వార్ 2 ప్రయాణంలో నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నా.. అయాన్ అమేజింగ్.. ఆడియన్స్ కు ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నాడు. యష్ రాజ్ టీం చూపించిన ప్రేమ ఆప్యాయతకు థాంక్స్. ఈ అద్భుతమైన సినిమా మీరు ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఆగష్టు 14 వరకు వేయి ఉండలేకపోతున్నా అని రాసుకొచ్చారు.

దేవర ఎన్టీఆర్ వార్ 2 గురించి షేర్ చేసిన ఈ అప్డేట్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హామీ ఇస్తూ విజువల్ ఎక్స్ పీరియన్స్ అన్నాడు కాబట్టి సినిమా అదిరిపోతుందని ఫిక్స్ అయ్యారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన వార్ 2 సినిమాను హిందీలోనే కాదు తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

వార్ 2 ప్రమోషన్స్ విషయంలో కూడా యస్ రాజ్ మేకర్స్ క్రేజీ ప్లానింగ్ లో ఉన్నారట. ఈ సినిమా ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. వార్ 2 లో హృతిక్ రోషన్ కి ఏమాత్రం తగ్గని విధంగా ఎన్ టీ ఆర్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు హృతిక్ రోషన్. అందుకే సినిమాను తెలుగులో ఎన్టీఆర్ సోలో సినిమా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Tags:    

Similar News