వార్ 2 హ్యాష్‌ట్యాగ్ యుద్ధం: ఎన్టీఆర్ vs హృతిక్.. ట్విట్టర్‌లో మాస్ ఫైట్
ఇప్పుడు X ట్విట్టర్‌లో హీరోల మధ్య హ్యాష్‌ట్యాగ్ యుద్ధం ప్రేక్షకుల్ని మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది.;
బాలీవుడ్‌లో స్పై యాక్షన్ చిత్రాలకే కాదు, సోషల్ మీడియా ప్రమోషన్ కి కూడా కొత్త ట్రెడ్ ని ఫాలో అవుతున్న మూవీ వార్ 2. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. సినిమా స్టోరీ, యాక్షన్ సీన్లు, స్పెషల్ కెమెరా వర్క్‌తో పాటు ప్రమోషన్ స్ట్రాటజీ కూడా హైలెట్ అవుతోంది. ఇప్పుడు X ట్విట్టర్‌లో హీరోల మధ్య హ్యాష్‌ట్యాగ్ యుద్ధం ప్రేక్షకుల్ని మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది.
ఇక్కడ నుంచే యాక్షన్ మొదలవుతోంది
హృతిక్ రోషన్ తన ట్విట్టర్‌లో "మళ్లీ యుద్ధ రేఖలు పడ్డాయి. హ్యాష్‌ట్యాగ్ అన్నింటికంటే ముందే చెబుతోంది! ప్రతి అప్‌డేట్, ప్రతి సీక్రెట్ కోసం #HrithikvsNTR హ్యాష్‌ట్యాగ్‌ను ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచే యాక్షన్ మొదలవుతోంది!" అంటూ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కి ఫ్యాన్స్ భారీగా స్పందించారు. వార్ 2 విషయానికి వచ్చే ప్రాముఖ్యతే హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా స్పష్టంగా తెలిసిపోయింది.
హ్యాష్‌ట్యాగ్ వార్
ఇది చూసిన ఎన్టీఆర్ వెంటనే స్వీట్ కౌంటర్ ఇచ్చాడు. "#War2 అప్‌డేట్స్ కావాలా, స్పెషల్ విషయాలు తెలుసుకోవాలా? హే హృతిక్ సర్, మనిద్దరం ఈ విషయంలో మాట్లాడుకున్నాం! ఇకమీదట ఒకే ఒక్క హ్యాష్‌ట్యాగ్: #NTRvsHrithik. అందరూ వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది!" అని ట్వీట్ చేశాడు. దీని తర్వాత హృతిక్ తిరిగి – “బాగుంది ఎన్టీఆర్ గారు! కానీ హ్యాష్‌ట్యాగ్ #HrithikvsNTR. ఇది కాంప్లికేట్ చేయకండి, సరే?” అంటూ స్పందించాడు.
రెండు వర్గాల మధ్య ట్రెండింగ్ వార్
చివరికి ఎన్టీఆర్ మరోసారి “హృతిక్ సర్, #NTRvsHrithik అనే హ్యాష్‌ట్యాగ్ చాలా బావుంది. ఇప్పుడే నాకు విజయం వచ్చిందని అనుకుందాం!” అంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఇద్దరి మధ్య హ్యాష్‌ట్యాగ్ ఫైట్ మాస్ లెవెల్‌లో సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తోంది. ఈ హ్యాష్‌ట్యాగ్ ఫైట్‌ను ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తీసుకువెళ్లారు. ఎవరి హీరో హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్కువగా ట్రెండ్‌లో ఉంచుతారన్న పోటీ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ #NTRvsHrithik హ్యాష్‌ట్యాగ్‌ను, హృతిక్ ఫ్యాన్స్ #HrithikvsNTRను ట్రెండ్ చేస్తున్నారు. ఇది వార్ 2 ప్రమోషన్‌కి బూస్ట్ ఇస్తోంది. రెండు ఇండస్ట్రీల అభిమానులు ఇలా క్రియేటివ్‌గా ప్రమోషన్ చేయడం ఇండియన్ సినిమా ప్రమోషన్ ట్రెండ్‌ను మార్చేసింది.
హిట్ కాంబో బాక్సాఫీస్ హవా
హృతిక్ - ఎన్టీఆర్ కాంబో ఆన్ స్క్రీన్ పై ఎలా ఉండబోతోందన్నదానికంటే ముందు, సోషల్ మీడియాలో ఈ హడావుడి సినిమా బజ్‌ను మళ్లీ పెంచుతోంది. హ్యాష్‌ట్యాగ్ యుద్ధంతో యూత్ అంతా “వార్ 2”పై ఫోకస్ పెంచారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ విలన్ షేడ్, హృతిక్ యాక్షన్ పవర్, కియారా అద్వానీ గ్లామర్ అన్నీ కలిసొచ్చేలా టీజర్‌లతో ఇప్పటికే సినిమా ప్రమోషన్ మళ్లీ పెరిగింది.
మునుపెన్నడూ లేని ప్రమోషన్
ఈ ట్విట్టర్ వార్, హ్యాష్‌ట్యాగ్ కౌంటర్‌స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమా విడుదలకు ముందే ప్రమోషన్ ఇలా పెద్ద స్థాయిలో జరగడం వల్ల, సినిమా బాక్సాఫీస్‌పై కూడా ప్రభావం చూపనుంది. ఈ ఇద్దరి సోషల్ మీడియా పోటీ నిజంగా సినిమా ప్రమోషన్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. వార్ 2పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మొత్తానికి, ఎన్టీఆర్ హృతిక్ మధ్య హ్యాష్‌ట్యాగ్ వార్‌తో “వార్ 2” మాస్ అటెన్షన్ సంపాదించడంలో 100% సక్సెస్ అయ్యింది.