వార్ 2: ఆ సీన్‌కు స్క్రీన్ చిరిగిపోద్దట!
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార నాగవంశీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గతంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం విశేషం.;
ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై సందడి చేయబోతున్న ఈ మల్టీ స్టారర్ కు మొదట్లో హైప్ బాగానే ఉన్నా టీజర్ తరువాత అంచనాలను అందుకోలేకపోవడం కొంత మైనస్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా.. ప్రమోషన్స్ లో జోరు పెంచలేదు. ఇక ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార నాగవంశీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గతంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం విశేషం. ఇప్పుడు వార్ 2 కోసం కూడా భారీ రేటుకు రైట్స్ దక్కించుకున్నారు. దీంతో ఆయన నుంచి ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు వస్తున్నాయి.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ గురించి ఓ మాస్ కామెంట్ చేశారు. ఆ సీన్ బాగా వచ్చింది. స్క్రీన్ చిరిగిపోతుంది.. అంటూ ఎన్టీఆర్ ఎంట్రీ గురించి గట్టిగానే క్రేజ్ పెంచారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆ సీన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, ఈ సినిమా రైట్స్ ఎందుకు దక్కించుకున్నారన్న ప్రశ్నకు నాగవంశీ సమాధానం ఇస్తూ..
ఇద్దరు ఇండియన్ స్టార్‌లు ఎన్టీఆర్, హృతిక్.. ఒకే సినిమాకోసం కలిసి వస్తున్నారు. వాళ్లిద్దరూ స్క్రీన్‌పై తలపడతారనేది ఒక్కటే నాకు బేస్. సినిమా చూసి కాదు.. ఆ ఫేసాఫ్ కోసం మాత్రమే ఈ సినిమా తెచ్చుకున్నాను. అది ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నాను.. అన్నారు. ఈ సినిమాకు 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. టెక్నికల్‌గా హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్‌లతో విడుదల కానుందని మేకర్స్ చెబుతున్నారు.
ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో ఈ సినిమాపై భారీ ఆసక్తి ఉంది. హిందీ డబ్ సినిమాల్లో ఇటీవలి కాలంలో ఇంత భారీ రేటుకు అమ్ముడైన సినిమా ఇదే కావడం విశేషం. వార్ 2 సినిమాతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల తలాపడే సీన్ కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో హైప్ తెచ్చిపెట్టేలా ఉంటుందని నాగవంశీ ఓ హింట్ అయితే ఇచ్చారు. ఇక ఆ మాస్ ఇంట్రో, ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే ఆగస్టు 14వరకూ వెయిట్ చేయాల్సిందే.