కొర‌టాల 'దేవ‌ర 2' ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా?

చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్ చేస్తే, ఎన్టీఆర్ `దేవ‌ర‌` చేయ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు.;

Update: 2025-06-14 05:55 GMT
కొర‌టాల దేవ‌ర 2 ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా?

రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ 'RRR'. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఇండియ‌న్ సినిమాకు తొలి ఆస్కార్‌ని అందించి ప్ర‌పంచ య‌వ‌నిక‌పై ఇండియా గొప్ప‌ద‌నాన్ని స‌గ‌ర్వంగా చాటి చిర‌త్ర సృష్టించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాపులారిటీ ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత ఏర్ప‌డిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ సినిమాలు ఎంచుకుంటున్నారు.

చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్ చేస్తే, ఎన్టీఆర్ 'దేవ‌ర‌' చేయ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'వార్ 2'లో న‌టిస్తున్న ఎన్టీఆర్ దీని షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌టంతో ప్ర‌శాంత్ నీల్ సినిమాని ప‌ట్టాలెక్కించాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా న‌డుస్తోంది.

ఈ మూవీని 2026లో ప్రేక్ష‌కుల ముందుకు భారీ స్థాయిలో తీసుకురాబోతున్నారు. దీని త‌రువాత `జైల‌ర్‌` ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం `జైల‌ర్ 2` ప‌నుల్లో బిజీగా ఉన్న నెల్స‌న్ ఈ ప్రాజెక్ట్ త‌రువాత ఎన్టీఆర్ తో చేయ‌బోయే మూవీని 2027లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. దీని త‌రువాత అంటే 2028లో త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్న మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ డ్రామా ఉంటుంది. ఇలా 2026 నుంచి 2028 వ‌ర‌కు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపేయ‌బోతున్నాడు.

మ‌రి ఈ నేప‌థ్యంలో కొర‌టాల శివ 'దేవ‌ర 2' ప‌రిస్థితేంట‌నే టాక్ వినిపిస్తోంది. 2026 నుంచి 2028 వ‌ర‌కు ఎన్టీఆర్ డైరీ ఖాలీ లేక‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో కొర‌టాల శివ `దేవ‌ర 2` ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ల మ‌ధ్య ఎన్టీఆర్‌కు `దేవ‌ర‌2` కోసం డేట్స్ కేటాయించే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ సీక్వెల్ ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, దీని కోసం కొర‌టాల నాలుగేళ్లు ఆగ‌క త‌ప్ప‌ద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News