బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి!

అందం అభినయంతో చక్కటి నడుమొంపులతో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. మరొకసారి బ్యాక్ లెస్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Update: 2026-08-21 04:48 GMT

అందాలు ఆరబోయడంలో కూడా ఒక కళ ఉంటుందని ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ప్రత్యేకించి మరి చూపెడుతున్న విషయం తెలిసిందే. అందాలు ఆరబోయడం అంటే చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడమే కాదు ఆ ఫ్యాషన్ సెన్స్ లో కూడా తమ అభిరుచులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకోవడం.. అంతేకాదు ఇలా గ్లామర్ వలకబోయడం అందరి తరం కాదు అని కొంతమంది ప్రత్యేకించి నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో సొగసుల సుందరి నోరా ఫతేహీ కూడా ఒకరు.



 


అందం అభినయంతో చక్కటి నడుమొంపులతో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. మరొకసారి బ్యాక్ లెస్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ లేటెస్ట్ ఔట్ ఫిట్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. లైట్ ఆరెంజ్ స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించిన ఈమె బ్యాక్ లెస్ అందాలతో పచ్చని చెట్ల మధ్య చాలా గ్లామర్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా ప్రకృతి కూడా పరవశించేలా తన లేటెస్ట్ ఔట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.



 


మొరాకో తీర ప్రాంతాలలో తోటలలో తిరుగుతూ ఆ ప్రాంతాన్ని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ప్రపంచస్థాయి కీర్తిని మించి తన మూలాలతో ఆమెకున్న బంధం ఎంత లోతైనదో ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే డాన్సర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె మోడల్,సింగర్, రియాలిటీ షో జడ్జ్ అంతకుమించి నటి కూడా..



 


రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్ , ఊపిరి వంటి చిత్రాలలో ఆడి పాడింది. ప్రత్యేకించి బాహుబలి సినిమాలో మనోహరి పాటతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తెలుగులో చివరిగా మట్కా సినిమాలో నటించినది. ఇక ఇప్పుడు కాంచన ఫోర్ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది నోరా ఫతేహీ.



 


ఇకపోతే నోరా ఫతేహి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆమెను ముడిపెడుతూ వైరల్ చేస్తున్న వదంతులు ఆమెను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న మొరాకో ఫుట్బాల్ ఆటగాళ్లయిన యాస్సిన్ బౌనౌ అలాగే అష్రాఫ్ హకీమీ లతో ఈమె రిలేషన్ లో ఉంది అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. అయితే వీటిని ఆమె స్పందించింది. వారు కేవలం తన స్నేహితులు మాత్రమేనని ఎప్పటికీ ప్రేమ భాగస్వాములు కాదు అంటూ స్పష్టం చేసింది. ఏది ఏమైనా తన పని తాను చేసుకుపోయినా ఇలాంటి రూమర్స్ ఎదుర్కోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి.

Tags:    

Similar News