వాళ్లు బ్రెయిన్ వాష్ చేయడం వల్లే మళ్లీ ఇండస్ట్రీకి వచ్చా
చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యా శెట్టి అందరికీ పరిచయస్తురాలే. కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవుళ్లు సినిమాలో బాల నటిగా నటించి ఎంతో మంచి ప్రశంసలు అందుకున్న నిత్యా ఆ తర్వాత లిటిల్ హార్ట్స్, దాగుడు మూతలు దండాకోర్ తో పాటూ పలు సినిమాల్లో నటించింది.;
చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యా శెట్టి అందరికీ పరిచయస్తురాలే. కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవుళ్లు సినిమాలో బాల నటిగా నటించి ఎంతో మంచి ప్రశంసలు అందుకున్న నిత్యా ఆ తర్వాత లిటిల్ హార్ట్స్, దాగుడు మూతలు దండాకోర్ తో పాటూ పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి నువ్వు తోపురా, ఓ పిట్టకథ లాంటి సినిమాలు చేసింది.
తెలుగులో పాటూ కోలీవుడ్ లో కూడా నిత్యా సినిమాలు చేసింది. అక్కడ కూడా బాలనటిగా కొన్ని సినిమాలు చేసింది. చిన్నప్పుడు బాలనటిగా పలు సినిమాలు చేసిన నిత్యా ఆ తర్వాత చదువుల కోసం తన యాక్టింగ్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. బాగా చదివి జాబ్ కూడా చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా నిత్యా శెట్టి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
తాను చిన్నగా ఉన్నప్పుడు మొదట్లో డాక్టర్ అవాలనుకుందట నిత్యా. కానీ తన చుట్టాల్లో ఒక డాక్టర్ ఉన్నారట. అతను డాక్టర్ అంటే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉండాలని చెప్పడంతో దాన్ని వదిలేసి బిటెక్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేశానని చెప్పింది. చదువయ్యాక కూడా తనకు యాక్టర్ అవాలనే ఆసక్తి కానీ, ఆలోచన కానీ లేదని నిత్యా శెట్టి తెలిపింది.
అందుకే స్టడీస్ అయిపోయాక ఇన్ఫోసిస్ లో జాబ్ వస్తే మైసూర్ వెళ్లి జాబ్ లో జాయిన్ అయ్యానని, జాబ్ చేస్తూనే ఇస్రో ఎగ్జామ్ కూడా రాసి పాసయ్యానని, ఇస్రోలో ఆఫర్ వస్తే వద్దనుకుని ఇన్ఫోసిస్‌లోనే ఉండిపోయానని, ఇన్ఫోసిస్ లో ఎంప్లాయ్ అవార్డ్స్ కూడా అందుకున్నానని, అక్కడ ఆఫీస్ లో ని కొలీగ్స్ నువ్వు ఒకప్పుడు ఆర్టిస్టువి కదా సినిమాలు చేసుకోవచ్చు కదా అని బ్రెయిన్ వాష్ చేయడంతో జాబ్ కు రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకొచ్చింది నిత్యా.