• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్​ హిట్​ టైటిల్​తో...

పవన్​ హిట్​ టైటిల్​తో నితిన్​ కొత్త మూవీ.. డైరెక్టర్​ ఎవరంటే?

| నితిన్​కు పవన్​ కల్యామ్ అంటే ఎంతో ఇష్టమో తెలిసిన విషయమే. ఆయనకు నితిన్​ వీరాభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు.

By - Tupaki Desk
Update: 2023-08-27 11:10 GMT

టాలీవుడ్‌ హీరో నితిన్ రీసెంట్​గా మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్​ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన తన కొత్త సినిమాను ప్రకటించడంతో పాటు సెట్స్​పైకి కూడా తీసుకెళ్లారు. 'వకీల్ సాబ్' ఫేమ్​ డైరెక్టర్​ వేణు శ్రీరామ్‌తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు.

సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి సహా పలువురు హాజరై సందడి చేశారు. మూవీటీమ్​కు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్​ అనౌన్స్​మెంట్​తో సినీ ప్రియుల్లో అంచనాలను పెంచేశారు మేకర్స్​. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​​ నటించిన సూపర్ హిట్​ మూవీ 'తమ్ముడు' టైటిల్‌ను తమ చిత్రానికి ఖరారు చేశారు.

ఈ విషయాన్ని హీరో నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'కొన్ని టైటిల్స్ ఎంతో బాధ్యతను పెంచేలా వస్తాయి. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. నా కొత్త సినిమా వేణు శ్రీరామ్, దిల్ రాజు గారితోనే' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

నితిన్​కు పవన్​ కల్యామ్ అంటే ఎంతో ఇష్టమో తెలిసిన విషయమే. ఆయనకు నితిన్​ వీరాభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు. అందుకే ఇప్పుడు పవన్ టైటిల్​ రానుండటం వల్ల మూవీ ఫ్యాన్స్​ ఆశలు పెట్టేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లు సమాచారం అందింది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మెదలు పెడతారని తెలిసింది. అలాగే సినిమాలో నటించే నటీనటులు, పని చేయబోయే ఇతర టెక్నీషియన్ల వివరాలను తెలియజేయనున్నారు.

ఇంకా నితిన్​ ఈ సినిమాతో పాటు పలు చిత్రాలను చేస్తున్నారు. 'భీష్మ' తర్వాత సరైన హిట్​ కోసం ఎదురుచస్తున్న ఆయన.. ప్రస్తుతం వెంకీ కుడుములతో ఓ చిత్రం, వక్కంతం వంశీతో మరో సినిమా చేస్తున్నారు. ఇవి రెండు సెట్స్​పైన ఉన్నాయి. ఈ మూడు చిత్రాలతో ఎలాగైనా గట్టి సక్సెస్​ను అందుకోవాలని నితిన్​ ప్రయత్నిస్తున్నారు.

Tags:    
  • Nithin 
  • Tollywood 
  • Younghero 
  • Pawankalyan 
  • Vakeelsab 
  • Venusriram 
  • Dilraju 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS