నితిన్ ఎల్లమ్మలో అతను కూడానా..?

నితిన్ నెక్స్ట్ సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.;

Update: 2025-04-30 18:45 GMT

లవర్ బోయ్ నితిన్ చేసిన రాబిన్ హుడ్ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. వెంకీ కుడుముల మీద ఉన్న నమ్మకంతో నితిన్ ఈ మూవీ చేశాడు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ఇదివరకు భీష్మ సినిమా చేసి హిట్ కొట్టారు. మరోసారి ఆ హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అనుకోగా అది కాస్త నిరాశ మిగిల్చింది. నితిన్ రాబిన్ హుడ్ రిజల్ట్ తో చాలా డిజప్పాయింట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ చేయబోతున్న సినిమాల మీద పూర్తి ఫోకస్ చేస్తున్నాడు.

నితిన్ నెక్స్ట్ సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు కాంపౌండ్ అది కూడా వేణు శ్రీరామ్ డైరెక్షన్ అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే లెక్క. అదీగాక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో వస్తుంది. ఒకప్పటి హీరోయిన్ లయ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. సో లయ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది.

తమ్ముడు సినిమాలో సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు సూపర్ అనిపించేస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నితిన్ ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. ఎల్లమ్మ సినిమాను బలగం ఫేమ్ వేణు యెల్దండి డైరెక్ట్ చేస్తున్నాడు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి ఎల్లమ్మ అంటూ మరో అద్భుతమైన కథతో వస్తున్నాడు. ఈ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉందని టాక్.

ఐతే ఈ సినిమాలో బలగం సెంటిమెంట్ ని కొనసాగించేలా అందులో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శిని కూడా ఎల్లమ్మలో పెడుతున్నాడని టాక్. నితిన్ ఎల్లమ్మలో ప్రియదర్శి ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అది సినిమాను టర్న్ చేసే పాత్ర అని టాక్. ఆల్రెడీ నితిన్ కూడా ఎల్లమ్మ కథ అద్భుతంగా వచ్చిందని. అందులో తాను ఎంత గొప్పగా నటిస్తే అంత పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు. వేణు కూడా ఎల్లమ్మ సినిమాను అంచనాలను మించి తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు. ఎల్లమ్మ టైటిల్ రోల్ లో మహానటి కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎల్లమ్మ సినిమాతో మరోసారి వేణు తన డైరెక్షన్ మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. మే చివర్లో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News