• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నితిన్ దొంగ వేషాలు.....

నితిన్ దొంగ వేషాలు.. దేనికోసం?

| మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఆరంభంలో సుప్రీం హీరో అయ్యాక ఎక్కువగా మాస్ యాక్షన్ కథలు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-13 04:57 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఆరంభంలో సుప్రీం హీరో అయ్యాక ఎక్కువగా మాస్ యాక్షన్ కథలు చేశారు. వాటిలో రాబిన్ హుడ్ తరహాలో ఉండే మూవీస్ కూడా ఉన్నాయి. అలా వచ్చిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘కొండవీటి దొంగ’ చిత్రం గురించి. ఈ సినిమాలో హీరో పెద్దోళ్లని దోచుకొని పేదోళ్లకి పెడుతూ ఉంటాడు. ఆ సినిమా స్ఫూర్తితో తరువాత చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నాయి.

అయితే చాలా కాలం తర్వాత మరల నితిన్ ‘ కొండవీటి దొంగ’ సినిమా తరహా షేడ్స్ ఉన్న ‘రాబిన్ హుడ్’ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకి కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో ‘భీష్మ’ వచ్చింది. ఈ సినిమా నితిన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. దీని తర్వాత ఇప్పటి వరకు నితిన్ సక్సెస్ పడలేదు.

మరోసారి ‘రాబిన్ హుడ్’ సినిమాతో హిట్ వస్తుందనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో నితిన్ బ్లాక్ మాస్క్ వేసుకొని కనిపిస్తున్నాడు. ‘దొంగ’ సినిమాలోని చిరంజీవి కూడా ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకొని దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ తరహాలోనే నితిన్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుందనే మాట వినిపిస్తోంది.

వెంకి కుడుములు ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాలు కంప్లీట్ ఫన్ మిక్స్ చేసి తెరపై ఆవిష్కరించారు. ‘రాబిన్ హుడ్’ కూడా అలాగే ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే నితిన్ చేసే దొంగతనాలు చాలా కొత్తగా డిజైన్ చేసాడనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆ క్యారెక్టర్ కూడా కామిక్ గానే ఉండబోతోందంట.

మరి మెగాస్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథని వెంకి కుడుముల సిద్ధం చేసుకున్నారా లేదంటే ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే కొత్త కథని చెప్పబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. క్రిస్మస్ ఫెస్టివల్ కానుకగా రాబోతున్న ఈ సినిమాకి టాలీవుడ్ నుంచి టఫ్ ఫైట్ అయితే లేదు. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Tags:    
  • Robinhood 
  • Nithiin 
  • Venkykudumula 
  • Sreeleela 
  • Tollywood 
  • Robinhoodmovie 
  • Chiranjeevi 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS