ఇస్మార్ట్ బ్యూటీ ఇక్కడ ఫోకస్ చేస్తుందా..?
ఐతే ఈ రెండు సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నిధికి మంచి సక్సెస్ పడేలా ఉన్నాయని చెప్పొచ్చు.;
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో మిస్టర్ మజ్ను, సవ్యసాచి సినిమాలు చేసిన అమ్మడు ఆ తర్వాత పూరీ తీసిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుంది. ఐతే ఇస్మార్ట్ శంకర్ తర్వాత అయినా అమ్మడు వరుస ఛాన్స్ లు అందుకుంటుంది అనుకుంటే ఇక్కడ అవకాశాలు వస్తున్నా కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది నిధి. ఐతే మళ్లీ తెలుగు పరిశ్రమ ఆఫర్లు రాగానే ఇక్కడకు వచ్చింది.
నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేసింది. ఆ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో కూడా నటించి నిధి అగర్వాల్. రాజా సాబ్ లో మాళవిక మోహనన్ కి గట్టి పోటీ ఇచ్చేలా నిధి అగర్వాల్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో రెండు భారీ సినిమాలతో మరోసారి ఇక్కడ తన లక్ టెస్ట్ చేసుకుంటుంది అమ్మడు.
ఐతే ఈ రెండు సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నిధికి మంచి సక్సెస్ పడేలా ఉన్నాయని చెప్పొచ్చు. వీరమల్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆ సినిమాను కూడా క్రిష్ డైరెక్షన్ లో మొదలై జ్యోతి కృష్ణ మధ్యలో టేకప్ చేయాల్సి వచ్చింది. ఐతే ఆ సినిమా ఎలా ఉన్నా ప్రభాస్ రాజా సాబ్ మాత్రం నిధి కి మళ్లీ కిక్ ఇచ్చేస్తుందని అంటున్నారు.
అందం అభినయం రెండు కలగలిపి నట్టుగా ఉండే నిధి ఈపాటికి టాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోయిన్ అవ్వాల్సింది కానీ తమిళ పరిశ్రమ నుంచి ఆఫర్లు రాగానే అక్కడికి వెళ్లిన అమ్మడు అక్కడ సినిమాలు చేసి కోలీవుడ్ ఆడియన్స్ ని అలరించింది. ఐతే మళ్లీ అమ్మడి మనసు టాలీవుడ్ వైపు లాగింది. అందుకే ఇక్కడ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. రాబోతున్న రెండు సినిమాలు కూడా సక్సెస్ అయితే మాత్రం నిధికి మరింత లక్ కలిసి వస్తుందని చెప్పొచ్చు. నిధి లాంటి అందాల భామ తెలుగులో కొనసాగాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అమ్మడికి వీరమల్లు, రాజా సాబ్ సినిమాల తర్వాత ఎలాంటి ఛాన్స్ లు వస్తాయన్నది చూడాలి.