ఆ రెండిటితో ఫాంలోకి వస్తుందా..?
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుని క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తుందని ఊహించగా సడెన్ గా కోలీవుడ్ షిఫ్ట్ అయ్యి షాక్ ఇచ్చింది;
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుని క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తుందని ఊహించగా సడెన్ గా కోలీవుడ్ షిఫ్ట్ అయ్యి షాక్ ఇచ్చింది. గల్లా అశోక్ తో హీరో సినిమా చేసిన నిధి అగర్వల్ ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేసిన ఈ అమ్మడు ఆ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అదే కాదు ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో కూడా నిధి నటిస్తుంది.
తెలుగులో దాదాపు కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైం లో ఒకేసారి రెండు భారీ సినిమాలతో రాబోతుంది నిధి అగర్వాల్. వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అనుకున్నారు కానీ మళ్లీ వాయిదా వేశారు. సినిమా ఐతే మరో నెల రోజుల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ రాజా సాబ్ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది.
ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడంతో నిధి అగర్వాల్ మళ్లీ టాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. వీరమల్లు, రాజా సాబ్ రెండు సినిమాలు కూడా వేరు వేరు కథలతో వస్తున్నాయి. వీరమల్లు సినిమా పీరియాడికల్ కథతో ఒక బందిపోటు దొంగ కథతో వస్తుంటే రాజా సాబ్ మాత్రం థ్రిల్లర్ కథతో వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్టు పడితే మాత్రం నిధి తిరిగి ఫాం లోకి వస్తుందని చెప్పొచ్చు.
నిధి లాంటి అందాల భామకు తెలుగులో అవకాశాలు వస్తున్నా కూడా ఆమె కావాలని కాదంటుందని అంటున్నారు. మొన్నటిదాకా తమిళ్ లో బిజీగా ఉంది కాబట్టి తెలుగు సినిమాలు చేయలేదు కానీ ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు లేవు కాబట్టి తెలుగులో నిధి అగర్వాల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిధి తెలుగులో బిజీ అయితే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే అని చెప్పొచ్చు. పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఒకేసారి ఛాన్స్ అందుకున్న నిధి ఆ సినిమాలు 3, 4 నెలల గ్యాప్ లో రిలీజ్ అవ్వడంతో అమ్మడికి కలిసి వచ్చేలా ఉంది.