పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ను ఇమిటేట్ చేసిన నిధి.. ఫిదా అయిన ఫ్యాన్స్
ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కూడా అదే చేస్తున్నారు. తన కమిట్‌మెంట్, కామెంట్స్ తో స్టార్ హీరోల ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకున్నారు నిధి.;
ఈ మధ్య హీరోయిన్లు కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాతృ భాష కాకపోయినప్పటికీ, వేరే భాష నుంచి వచ్చినప్పటికీ ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా ఇక్కడి కల్చర్ కు తగ్గట్టు వ్యవహరిస్తుంటారు. ఫ్యాన్స్ వారి హీరోలు, హీరోయిన్ల విషయంలో చేసే కామెంట్స్, ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తుంది? ఆడియన్ ఏ స్లోగన్స్ కు ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుని మరీ వాటిని మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కూడా అదే చేస్తున్నారు. తన కమిట్‌మెంట్, కామెంట్స్ తో స్టార్ హీరోల ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకున్నారు నిధి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన హరి హర వీరమల్లు మూవీ ఎంత లేటైనా నిర్మాతలకు ఇచ్చిన కమిట్‌మెంట్ కోసం ఆ మూవీ కోసం వెయిట్ చేశారు తప్పించి లేటవుతుంది కదా అని దాన్నుంచి పక్కకు తప్పుకోలేదు.
నిధిని అభినందించిన పవన్
అక్కడే నిధి పవన్ ఫ్యాన్స్ మనసుల్ని గెలిచేశారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ సమయంలో కూడా పవన్ ఎక్కువగా టైమ్ కేటాయించలేకపోతారేమో అని ప్రమోషన్స్ బరువుని తన భుజాలపై వేసుకుని చేశారు. ఈ విషయంలో స్వయంగా పవన్ నిధిని అభినందించారు. పవన్ నిధిని పొగిడిన తర్వాత అతని ఫ్యాన్స్ నుంచి అమ్మడికి మరింత సపోర్ట్ దక్కింది.
వీరమల్లు వల్ల మంచే జరిగింది
రిలీజ్ తర్వాత వీరమల్లు సినిమా ఫ్లాపైనా సరే ఆ సినిమా చేసినందుకు బాధగా ఉందని నిధి ఎప్పుడూ చెప్పకపోగా, ఆ మూవీ వల్ల తనకు మంచే జరిగిందని, సినిమాలో తన యాక్టింగ్ కు మంచి పేరొచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు నిధి, ప్రభాస్ తో చేసిన రాజా సాబ్ కోసం కూడా అలానే కష్టపడుతున్నారు.
రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది పడినప్పటికీ వారిని నిధి ఏమీ అనకుండా అవన్నీ కామనే అనుకుని లైట్ తీసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. తాజాగా రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా నిధి తాను వర్క్ చేసిన హీరోల గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటారనే విషయంపై చేసిన కామెంట్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. పవన్ గురించి ఫ్యాన్స్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటారని, ప్రభాస్ గురించి రాజులకే రాజు ప్రభాస్ రాజు అంటారని, తన గురించి పాపలకే పాప నిధి పాప అంటారని చెప్పి ఫ్యాన్స్ ను ఇమిటేట్ చేశారు నిధి. ఇవన్నీ మీకెలా తెలుసని ఆమెని అడిగితే మూవీ ఈవెంట్స్ లో ఫ్యాన్స్ ఇలాంటి స్లోగన్స్ తోనే మరింత జోష్ పెంచుతుంటారని, ఇవన్నీ అలా వినడం వల్లే తనకు తెలిశాయని నిధి చెప్పి పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.