మరిది షోలో ప్రియాంక చోప్రా సందడి
ఓవైపు లైవ్ షో సాగుతోంది. పాట జోరెక్కింది! పబ్లిక్ గోల గోల చేస్తూ ఉర్రూతలూగుతున్నారు.;
ఓవైపు లైవ్ షో సాగుతోంది. పాట జోరెక్కింది! పబ్లిక్ గోల గోల చేస్తూ ఉర్రూతలూగుతున్నారు. కానీ ఇంతలోనే ఆ క్రౌడ్ లోంచి తన భార్య ప్రియాంక చోప్రాతో కనిపించాడు నిక్ జోనాస్. అతడు చాలా డీసెంట్ గా తన భార్య చేతిని పట్టుకుని ఈవెంట్లోకి తీసుకెళుతున్నాడు. చాలా చిలిపి కుర్రాడే అయినా నిక్ చాలా డీసెంట్ గా కనిపించడం అస్సలు ఊహించలేదు! అంటూ అభిమానులు ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.
నిక్ జోనాస్ -ప్రియాంక చోప్రా ఇటీవల జో జోనాస్ షోలో కనిపించారు. `ది జో` షో అనేది యూట్యూబ్‌లో ప్రతి గురువారం ప్రసారమయ్యే అరబిక్ టాక్ షో. దీనిని ఖతార్‌కు చెందిన స్టూడియో మెటాఫోరా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ షోలో ఒక ఎపిసోడ్ కోసం పీసీ- నిక్ జంట జో జోనాస్ తో కలిసారు. వారి సందడి పీక్స్ కి చేరుకుంది. జో జోనాస్ తన కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసి టాక్ షోలో ఒక పాటను ప్రదర్శించాడు. తన సోదరుడికి నిక్ పూర్తి మద్దతును తెలియజేశారు. ఈ ఈవెంట్ నుండి కొన్ని వీడియోలను నిక్ జోనాస్ ఇన్‌స్టాలో షేర్ చేసాడు. జో ప్రదర్శనకు గర్వంగా ఉందని నిక్ జోనాస్ వ్యాఖ్యను జోడించాడు. జన హృదయాలను తాకేలా షోలో ప్రదర్శన ఇచ్చాడని ప్రశంసించాడు. జోజోనాస్ గత ఏడాది తన భార్య సోఫీ టర్నర్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి కాపురంలో సమస్యలు ఏర్పడటం, దానికి పీసీ బాధను వ్యక్తం చేయడం తెలిసిందే.
జో జోనాస్- సోఫీ విడిపోయిన క్రమంలోనే పీసీ- నిక్ జంట అన్యోన్యత కూడా ఎంతగానో చర్చకు వచ్చింది. మరోవైపు ప్రియాంక చోప్రా ఇటీవల భారతదేశంలో వరుస సినిమాలకు కమిటవుతోంది. మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంది. కొంత గ్యాప్ లో ఇలా విదేశాల్లో తన భర్తతో కలిసి షికార్ చేస్తోంది.