• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గేమ్ ఛేంజర్'.. శంకర్...

'గేమ్ ఛేంజర్'.. శంకర్ హోప్స్ పెంచారుగా!

| సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న టీజర్.. యాక్షన్ తో నిండిపోయిందనే చెప్పాలి మంచి కమర్షియల్ గా మేకర్స్ టీజర్ ను కట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-10 15:08 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మొదలైన ఆ సినిమా షూటింగ్ అనేక కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల కానుంది.

సినిమాలో రామ్ చరణ్ తో పాటు కియారా అడ్వాణీ, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు సమకూర్చుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మేకర్స్.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో అంత ఎదురుచూస్తున్న టీజర్ ను నిన్న లక్నోలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న టీజర్.. యాక్షన్ తో నిండిపోయిందనే చెప్పాలి. మంచి కమర్షియల్ గా మేకర్స్ టీజర్ ను కట్ చేశారు. తెల్ల చొక్కా, తెల్ల లుంగీతో పాటు సూటు బూటు, స్పోర్స్ బైక్ పై వస్తున్న రైడర్ గెటప్స్‌ లో కనిపించారు రామ్ చరణ్. మూడు వైవిధ్య పాత్రల్లో మెప్పించారు. తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మొత్తంగా హీరో రోల్ ను వివరిస్తూ ఉన్న టీజర్ అందరినీ అలరిస్తోంది.

చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ మార్క్ టీజర్ లో క్లియర్ గా కనిపించింది. హీరోయిన్ తో రొమాన్స్ ను చూపించారు. మాస్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్ సీన్స్ ను కూడా యాడ్ చేశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు క్లియర్ అర్థమవుతోంది. గేమ్ ఛేంజర్ విజువల్ గ్రాండియర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ టీజర్ చూస్తుంటే.. శంకర్ పాత హిట్ సినిమాలు గుర్తుకు వస్తున్నాయనే చెప్పాలి.

ఇప్పుడు గేమ్ ఛేంజర్ స్టోరీ కూడా శంకర్ ఇప్పటికే తీసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కథల్లా ఉంటే.. సినిమా రిజల్ట్ తిరుగులేనట్లే. అయితే కొంతకాలంగా శంకర్ తెరకెక్కించిన చిత్రాలు మిస్ ఫైర్ అవుతున్నాయి. కమల్ భారతీయుడు 2 డిజాస్టర్ గా మారింది. దీంతో గేమ్ ఛేంజర్ పై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ టీజర్ తో మాత్రం శంకర్ ఆడియెన్స్ లో హోప్స్ పెంచారు. ఆయన కూడా మంచి కమ్ బ్యాక్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మరి శంకర్ ఎలాంటి హిట్ కొడతారో? చరణ్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తారో వేచి చూడాలి.

Tags:    
  • Gamechanger 
  • Shankar 
  • Ramcharan 
  • Gamechangerteaser 
  • Kiaraadvani 
  • Dilraju 
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechangerfilm 
  • Gamechangersong 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS