వేలెత్తి చూపిస్తూ హెచ్చరించాడు.. బిత్తరపోయిన నటి!
నీల్ కానీ అనుష్క కానీ ఈ వీడియో గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది అపార్థమా లేదా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది ఎదురైందా? అన్నదానిపై స్పష్ఠత లేదు.;
సాటి ఆర్టిస్టు వైపు వేలెత్తి చూపిస్తూ నటుడు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో నటుడు మరెవరో కాదు నీల్ నితిన్ ముఖేష్. ఆ నటి పేరు అనుష్క షేన్. అసలు ఏమైందో కానీ, నీల్ నితిన్ ఆమె వైపు చాలా సేపు వేలెత్తి(చూపుడు వేలు) చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నాడు. అతడి ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ సీరియస్ గా ఉన్నాయి. అటువైపు అనుష్క షేన్ కొంత భయం భయంగా గుబులుగా కనిపించింది.
అంతాగా వేలెత్తి చూపిస్తూ తిట్టేసేంత తప్పు ఏం చేసిందో కానీ పాపం అనుష్క బిత్తరపోయి కనిపించింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. మంగళవారం (మే 13), అనుష్క ముంబైలో నీల్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన `హై జునూన్` ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో నీల్- అనుష్క మధ్య సన్నివేశానికి సంబంధించిన ఫోటో హైలైట్ అయింది.
నీల్ కానీ అనుష్క కానీ ఈ వీడియో గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది అపార్థమా లేదా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది ఎదురైందా? అన్నదానిపై స్పష్ఠత లేదు. ఎవరికి వారు అప్పటికి ఊహాగానాలు సాగించారు.
కానీ ఈవెంట్ జరిగిన వెంటనే నీల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అనుష్క సహా ఇతరులతో కలిసి ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేసాడు. హై జునూన్ విడుదలకు సిద్ధమవుతోంది. మే 16న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. జాక్వెలిన్ ఈ వెబ్ సిరీస్‌తో డిజిటల్ అరంగేట్రం చేయనుంది. ఈ సిరీస్ ముంబైలోని ఒక ప్రతిష్టాత్మక కళాశాలలో GOAT ట్రోఫీ కోసం పోటీ పడుతున్న రెండు మ్యూజిక్ క్లబ్‌లు, ది మిస్ఫిట్స్ - ది సూపర్‌సోనిక్స్ మధ్య పోటీ కథేమిటన్నది తెరప యచూడాలి. దీనికి ఆదిత్య భట్ - అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు.