అత్యున్నత పురస్కారంకు రెండు అడుగుల దూరంలో...!
ఇండియన్ సినీ ప్రేక్షకులను ఆస్కార్ అవార్డ్ ప్రతి ఏడాది ఊరిస్తూనే ఉంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కారణంగా ఇండియాకి ఆస్కార్ దక్కింది.;
ఇండియన్ సినీ ప్రేక్షకులను ఆస్కార్ అవార్డ్ ప్రతి ఏడాది ఊరిస్తూనే ఉంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కారణంగా ఇండియాకి ఆస్కార్ దక్కింది. మళ్లీ ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది వేలాది సినిమాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్క్రీనింగ్ అవుతూ ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు వందల కోట్లు.. వేల కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాయి. కానీ ఒకటి రెండు సినిమాలు కూడా ఆస్కార్ తుది నామినేషన్స్‌లో ఉండలేక పోతున్నాయి. ఈ ఏడాదికి గాను ఇండియా నుంచి అధికారికంగా హోమ్‌బౌండ్ అనే సినిమా ఆస్కార్ ఎంట్రీని దక్కించుకుంది. ఆస్కార్ నుంచి హోమ్‌బౌండ్‌కి సానుకూల స్పందన లభించింది. మొదటి గ్రేడింగ్‌లో ఈ సినిమా పాస్ అయింది. ఇటీవల అకాడమీ నుంచి విడుదలైన టాప్ 15 చిత్రాల జాబితాలో హోమ్‌బౌండ్ సినిమా నిలవడంతో మరో రెండు అడుగుల దూరంలో ఆస్కార్ నిలిచింది.
ఆస్కార్ అవార్డ్‌ల జాబితా
జనవరి 22వ తారీకున ఈ 15 సినిమాల నుంచి 5 సినిమాలను తుది జాబితా గా ప్రకటిస్తారు. పలు అంతర్జాతీయ స్థాయి సినిమాలతో పోటీ పడి మరీ హోమ్‌బౌండ్ సినిమా టాప్ 5 లో చోటు సంపాదించాల్సిన అవసరం ఉంది. మార్చి 15, 2026 న లాస్ ఏంజిల్స్ లో జరిగే భారీ వేడుకలో ఆస్కార్ విజేతలను ప్రకటించడం జరుగుతుంది. టాప్ 15 లో ఉన్న మన సినిమా మరో అడుగు వేసి టాప్ 5 లో చోటు సంపాదించే అవకాశం ఉంది. చివరి అడుగు వేసి హోమ్‌బౌండ్ సినిమా ఆస్కార్ ను ఇండియాకు తీసుకు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సినిమాలకు బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావడం జరగలేదు. మరి ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశం మొత్తం ప్రస్తుతం ఈ సినిమా వైపు చూస్తున్నారు. ఈ నెలలోనే టాప్ 5 లో చోటు విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
హోమ్‌బౌండ్ సినిమాలో...
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించారు. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ఈ సినిమాలో నటించారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం జరిగింది. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకట్టుకుంది. కమర్షియల్‌గా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా మంచి రివ్యూలు దక్కించుకుంది. సినిమాలో నటీనటులు చక్కని నటనతో ఆకట్టుకున్నారు. దాంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది అనేది రివ్యూవర్స్ అభిప్రాయం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 లో స్క్రీనింగ్ అయిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమా పూర్తి అయిన తర్వాత ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఆ సమయంలో చర్చనీయాంశం అయింది. సెప్టెంబర్ 26న ఈ సినిమాను దేశ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా
ఒక మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులు కావాలని కలలు కంటూ ఉంటారు. పోలీసు ఉద్యోగం అనేది సమాజంలో గౌరవం తెచ్చి పెట్టడంతో పాటు మంచి జీవితాన్ని ఇస్తుందని వారు భావిస్తారు. పోలీసు ఉద్యోగం సాధించే క్రమంలో ఆ ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన సంఘర్షణ ఈ సినిమా కథగా చూపించారు. వారు ఎదుర్కొన్న ఒత్తిడి, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఈ తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అయితే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని, కాస్త స్లో కథనం అంటూ నెగిటివ్ రివ్యూలు కొందరు ఇచ్చారు. దాంతో కమర్షియల్‌గా సినిమా రాబట్టాల్సిన స్థాయిలో రాబట్టలేక పోయింది అనేది కొందరి అభిప్రాయం. కమర్షియల్‌గా నిరాశ పరచినా అవార్డ్‌ల పరంగా సినిమాకు మంచి స్పందన దక్కిందని చెప్పుకోవచ్చు.