NBK111పై తమన్ కామెంట్స్.. ఆకాశాన్నంటిన ఫ్యాన్స్ అంచనాలు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

Update: 2026-07-31 10:52 GMT

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న తాజాగా ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రాజెక్ట్ చుట్టూ కొత్త హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా త‌మ‌న్ ఈ సినిమా కేవ‌లం 111 కాదు, ట్రిపుల్ షాట్ అంటూ చేసిన కామెంట్ సినిమాపై హైప్ ను పెంచుతుంది.

అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య వేరే లెవెల్‌లో ఉంటార‌ని, ఆ లుక్ లో వ‌చ్చే సీన్ థియేటర్లలో రచ్చ చేస్తాయ‌ని చెప్పిన మాట‌లు ఫ్యాన్స్ లో ఆసక్తిని మరింత పెంచాయి. తమన్ కామెంట్స్ లో ప్ర‌త్యేకంగా నిలిచింది టైటిల్ పై ఇచ్చిన హింట్. NBK111 టైటిల్ చాలా క్రేజీగా ఉంటుంద‌ని ఆయన చెప్పడం సోషల్ మీడియాలో భారీ డిస్క‌ష‌న్ కు దారి తీసింది. సాధారణంగా స్టార్ హీరో సినిమాల్లో టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ప్రమోషన్‌లో కీలక దశగా మారుతున్న సమయంలో, తమన్ చేసిన ఈ కామెంట్ సినిమా మేకర్స్ టైటిల్ విషయంలో స్పెష‌ల్ ప్లాన్‌తో ఉన్నారనే సంకేతాలను ఇస్తోంది.

గోపీచంద్ మలినేని ఈ సినిమాను భారీ మాస్ యాక్షన్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య- గోపీచంద్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మించి ఈసారి మరింత పెద్ద మాస్ ఎక్స్‌ప్లోజన్‌ను డిజైన్ చేస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి ఇప్పుడు తమన్ ఇస్తున్న హైప్ కూడా సినిమాపై అంచ‌నాలను పెంచుతుంది.

బాలయ్య సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, తమన్ ఈ ప్రాజెక్ట్‌పై చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో బాలయ్యతో క‌లిసి పలు సినిమాలకు వ‌ర్క్ చేసి తన మ్యూజిక్ తో మాస్ ఎలివేషన్స్‌కు కొత్త స్థాయి తీసుకొచ్చిన తమన్, ఈసారి కూడా అదే స్థాయి ఇంపాక్ట్‌ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతానికి సినిమా కథ, టైటిల్, పాత్ర స్వభావం వంటి అంశాలపై అధికారిక వివరాలు బ‌య‌ట‌కు రాలేదు కానీ తమన్ కామెంట్స్ మాత్రం బాలయ్య 111ను మేకర్స్ రెగ్యుల‌ర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, భారీ మాస్ ఈవెంట్‌గా పొజిషన్ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల దృష్టి ఇప్పుడు మరింతగా కేంద్రీకృతమైంది.

Tags:    

Similar News