అందుకే లైమ్ లైట్ లో ఉండలేకపోయా!
సూక్ష్మదర్శిని అనే ఓటీటీ ఫిల్మ్ లో ఆఖరిగా కనిపించిన ఈ మలయాళ నటి గత కొన్ని నెలలుగా అసలు సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు.;
బెంగుళూరు డేస్ మూవీతో ఒక్కసారిగా సౌత్ లో సెన్సేషన్ అయిన నజ్రియా నాజిమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన నజ్రియా రాజా రాణి సినిమాతో తెలుగు ఆడియన్స్ కు కూడా మరింత దగ్గరైంది. రాజా రాణి సినిమాతో నజ్రియాకు వచ్చిన ఫేమ్, పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల నజ్రియాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి.
సూక్ష్మదర్శిని అనే ఓటీటీ ఫిల్మ్ లో ఆఖరిగా కనిపించిన ఈ మలయాళ నటి గత కొన్ని నెలలుగా అసలు సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. నజ్రియా గతేడాది డిసెంబర్ లో ఆఖరిగా సోషల్ మీడియాలో కనిపించింది. అప్పట్నుంచి ఆమె లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తూ ఎవరికీ అందుబాటులో లేదు. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ నజ్రియా సోషల్ మీడియాలో ఓ లెటర్ ను పోస్ట్ చేసింది.
తాను లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ పడుతున్నానని, పర్సనల్ ఛాలెంజెస్ వల్ల లైమ్ లైట్ లో ఉండలేకపోయానని చెప్పిన నజ్రియా తన 30వ బర్త్ డే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, సూక్ష్మదర్శిని సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణలు కోరింది. ఈ టైమ్ లో తనకు ఎంతో మంది కాల్స్ చేసినా రెస్పాండ్ అవలేదని, తన పరిస్థితి బాలేనందునే తాను ఎవరికీ రెస్పాండ్ కాలేకపోయినట్టు నజ్రియా రాసుకొచ్చింది.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా నజ్రియా మానసిక పరిస్థితి బాలేదని కొందరంటుంటే, ఆమెకు అబార్షన్ అయిందని, దాని వల్ల నజ్రియా మానసికంగా చాలా కుంగిపోయి బయటకు రావడం లేదని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిలో దేని గురించీ నజ్రియా చెప్పలేదు. నజ్రియా లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేయడానికి గల పూర్తి కారణాన్ని వెల్లడించింది లేదు. కేవలం ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పడానికి మాత్రమే ఆ పోస్ట్ ను చేసింది. ఆ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్ నజ్రియా త్వరగా కోలుకుని మళ్లీ నార్మల్ అవాలని కోరుకుంటున్నారు.