• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యశ్‌ టాక్సిక్‌.. రంగంలోకి...

యశ్‌ టాక్సిక్‌.. రంగంలోకి లేడి సూపర్ స్టార్

| ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో యశ్‌తో పాటు నయనతారతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటానని చెప్పాడు.

By - Tupaki Desk
Update: 2025-01-24 15:30 GMT

సూపర్ స్టార్ యశ్‌ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా రానున్న టాక్సిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గీతూ మొహందాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, న్యారేషన్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపికలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్‌ని తీసుకోవాలని మేకర్స్ భావించారు.

అయితే రేమ్యునరేషన్ మరియు ఇతర కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు సమాచారం. ఆ పాత్ర సినిమాలో చాలా స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక యశ్ కు జోడిగా కీయరా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. కియారా ప్రస్తుతం యశ్‌తో కలిసి గోవాలో పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఇక బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబెరాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో యశ్‌తో పాటు నయనతారతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటానని చెప్పాడు. దీంతో నయనతార ఈ సినిమాలో భాగం కావడం పైన స్పష్టత వచ్చింది. ముందుగా కరీనా కపూర్‌ కోసం రాసుకున్న పాత్రకు ఇప్పుడు నయనతారను ఎంపిక చేశారట.

ఆమధ్య పాన్ ఇండియా చిత్రం జవాన్ తో ప్రేక్షకులను మెప్పించిన నయనతార, ఇప్పుడు యశ్ వంటి పాన్ ఇండియా హీరోతో కలిసి స్క్రీన్‌పై మెరవబోతోంది. నయనతార కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకురాబోతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా కథ విషయానికొస్తే, యశ్ ఈసారి పూర్తి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

కథ, మేకింగ్ రెండూ విభిన్నంగా ఉండబోతాయని టాక్. గీతూ మొహందాస్ డిఫరెంట్ డైరెక్షన్ ఈ సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా చేయబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టాక్సిక్ సినిమాకు నయనతార క్రేజ్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. యశ్-నయనతార కాంబినేషన్ ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

Tags:    
  • Yash 
  • ToxicMovie 
  • Nayanthara 
  • KiaraAdvani 
  • GeethuMohandas 
  • Toxicupdate 
  • Akshayoberoi 
  • Kareenakapoor 
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS