నయనతార తొలి వేతనం ఎంతో తెలుసా?
ప్రముఖ నటి పెర్లే మానీ తో నిర్వహించిన చిట్‌చాట్‌లో నయనతార కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి మొదట్లో లేదని కేవలం మోడలింగ్‌తోనే ప్రయాణం ప్రారంభమైందన్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న నయనతార ప్రస్తుతం కోట్లలో పారితోషికం అందుకునే అగ్రశ్రేణి నటీమణులలో ఒకరు. అయితే ఆమె సినీ రంగ ప్రవేశానికి ముందు ఎదుర్కొన్న తొలి రోజుల జ్ఞాపకాలను, మొట్టమొదటి సంపాదన గురించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ప్రముఖ నటి పెర్లే మానీ తో నిర్వహించిన చిట్‌చాట్‌లో నయనతార కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి మొదట్లో లేదని కేవలం మోడలింగ్‌తోనే ప్రయాణం ప్రారంభమైందన్నారు.
ఒక ఫ్యాషన్ ప్రోగ్రామ్ - మ్యాగజైన్ కవర్ షూట్ కోసం తనను ఆహ్వానించారని, ఆ తొలి అసైన్‌మెంట్‌కు గాను తనకు 2,000 నుంచి 3,000 వరకు మాత్రమే వేతనంగా వచ్చిందని సంతోషంగా గుర్తు చేసుకున్నారు. అలా మూడు వేలతో మొదలైన నయన్ ప్రయాణం నేడు కోట్లకు పడగెత్తింది. ఒక్కో సినిమాకు కోట్లలో ఛార్జ్ చేస్తున్నారు. యాడ్స్ లో నటించలేదు గానీ వాటికి గనుక కమిట్ అయితే? సినిమాలను మించిన ఆదాయం అమ్మడి ఖాతాలో జమ అవుతుంది.
అయితే నయనతార ఇలా తొలి పారితోషికాన్ని నిర్మొహమాటంగా పంచుకోవడం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి ఇండస్ట్రీలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న నయన్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నయనతార కెరీర్ పరంగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `టాక్సిక్` తో పాటు, విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా `హాయ్` చిత్రాల్లో ఆమె కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఒకే వారంలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నటిగానే కాకుండా మహిళా పారిశ్రామికవేత్తగా, నిర్మాతగా కూడా నయన్ విజయవంతమైన అడుగులు వేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును నిలబెట్టుకుంటూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన గత జ్ఞాపకాలను ఎప్పుడూ మరువని నయనతార సాదాసీదా స్వభావం అందరినీ ఆకట్టుకుంటోంది.
అలాగే `జవాన్` విజయంతో నయనతారకు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కమిట్ అయితే కోట్ల పారితోషికం వస్తుంది. కానీ ఆ విషయంలో నయనతార ఎంత మాత్రం తొందరపడలేదు. మనసుకు నచ్చిన పాత్రలు తప్ప అన్ని సినిమాల్లోనూ నటించను అన్న తీరుతోనే ముందుకెళ్తున్నారు. అలాగే చాలా కాలం పాటు ప్రచారానికి దూరంగా ఉన్న నయనతార మళ్లీ ఈ మధ్య కాలంలో సినిమా ప్రచారంలో పాల్గొనడంతో? ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.